ఈరోజు ఉదయం 11 గంటలకు శివసేన కీలక నేతలతో మహా సీఎం ఉద్ధవ్ ఠాక్రే భేటీ కానున్నారు.
నెల్లూరు ఆత్మకూరు ఉప ఎన్నికల పోలింగ్ షురూ అయ్యింది. ఇప్పటి వరకూ11 శాతం పోలింగ్ నమోదయ్యింది. ఆరు పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించాయి. కొత్త ఈ.వి.ఎం.లతో పోలింగ్ కొనసాగిస్తున్నారు. మరోవైపు ఆత్మకూరులో వైసీపీ, బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడం తో పోలీసులు రంగం లోకి దిగారు. ఇరువర్గాలను పోలిసులు శాంతింపచేస్తున్నారు.
Advertisement
ఎడ్ సెట్ దరఖాస్తు గడువును జులై 6వ తేదీ వరకు పొడిగించారు. డిగ్రీ ఫైనలియర్ చదువుతున్న విద్యార్థులకు కూడా అవకాశం కల్పిస్తున్నట్లు స్పష్టం చేశారు.
ఈ నెల 27న కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్షలు చేపట్టనుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీల ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టనున్నారు. అగ్నిపథ్ స్కీమ్‌ను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్షలు చేస్తోంది.
ఈ నెల 27 తేదీన అమ్మఒడి పథకం నిధులను ప్రభుత్వం విడుదల చేయనుంది. శ్రీకాకుళం జిల్లాలో 2022-23 ఆర్ధిక సంవత్సరానికి అమ్మఒడి పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు.
Advertisement
వానాకాలం పంటలకు సంబంధించి ఈ నెల 28 నుండి రైతు బంధు నిధులను విడుదల చేస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. దీని పై సీఎస్ సోమేష్ కుమార్ కు కేసీఆర్ ఆదేశాలు జారీచేశారు.
తెలంగాణాలో పదో తరగతి పరీక్ష ఫలితాలు ఈనెల 30 నాటికి వెల్లడిస్తామని అధికారులు స్పష్టం చేశారు. మూల్యాంకన ప్రక్రియ పూర్తయిన తర్వాత
సాంకేతికమైన లోపాలు లేకుండా చూసుకుంటామని చెప్పారు.
ప్రధాని మోడీ ఈ నెల 26 నుండి 28వ తేదీ వరకు జర్మనీ పర్యటించనున్నారు ఈ పర్యటనలో భాగంగా 26వ తేదీన దక్షిణ జర్మనీలోని ప్రఖ్యాత ష్లోస్ ఎల్మౌ కోటను సందర్శిస్తారు.
ఆర్టీసీ ఉద్యోగులకు జూలై 1నుండి ప్రభుత్వ స్కేల్ ప్రకారం జీతాలు ఇస్తామని ఏపీ సర్కార్ ప్రకటించింది. విజయవాడలో పనిచేస్తున్న వారికి అదనపు హెచ్చార్సి చెల్లిస్తామని స్పష్టం చేసింది. దాంతో కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్ లకు ఎక్కువ లాభం చేకూరుతుందని తెలిపింది.
తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు యూనిఫాం పంపిణీ ఈసారి ఆలస్యం కానుంది. యూనిఫామ్ లను రెండు దశల్లో సరఫరా చేస్తామని టెస్కో విద్యా శాఖకు సమాచారం ఇచ్చింది. సెప్టెంబర్ కల్లా విద్యార్థులకు యూనిఫాం లు సరఫరా చేయబోతున్నట్టు తెలుస్తోంది.