సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసంపై విచారణ కొనసాగుతోంది. ఛలో సికింద్రాబాద్ వాట్సాప్ గ్రూప్‌ను పోలీసులు గుర్తించారు. ముందస్తు కుట్రతోనే విధ్వంసం జరిగినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆర్మీ అభ్యర్థులతో పాటు ప్రైవేట్ వ్యక్తులు చొరబడినట్లు గుర్తించారు.
Advertisement
హైదరాబాద్ జంటనగరాల్లో తిరిగే ఎంఎంటీఎస్ సర్వీసులను రెండు రోజులు దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. ఈరోజు కూడా సుదూర ప్రాంతాలకు వెళ్లే పలు రైళ్లను అధికారులు రద్దు చేసినట్టు ప్రకటించారు.
నేడు త్రివిధ దళాధిపతులతో కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ భేటీ కానున్నారు. అగ్నిపథ్ పథకంపై సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు.
నాగర్ కర్నూల్ జిల్లాలో నేడు మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. నాగర్ కర్నూల్, కొల్లాపూర్ నియోజక వర్గాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు.
అనంతపురం జిల్లా తాడిపత్రిలోని జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించారు. పలు అధికారులు పలు పత్రాలను క్షుణంగా పరిశీలించారు. జేసీ సోదరులు వినియోగించే వాహనాలను సైతం అధికారులు పరిశీలించారు.
Advertisement
నేడు భారత్ బంద్ కొనసాగుతోంది. బీహార్ లో ఆందోళన చేస్తున్న యువకులు భారత్ బంద్‌కు పిలుపునిచ్చారు. RJD ఆధ్వర్యంలోని ప్రతిపక్ష పార్టీలు ఈ బంద్‌కు పూర్తి మద్దతు ప్రకటించాయి.
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24గంటల్లో కొత్తగా 13,216 కేసులు నమోదయ్యాయి. కరోనా తో 23 మంది మరణించారు.
అగ్నిపథ్ కు వ్యతిరేఖంగా నిరసనలు చేస్తున్న నేపథ్యం లో కేంద్రం కీలక ఆదేశాలు జారీచేసింది. అస్సాం రైఫిల్స్, సీఏపీఎఫ్ లలో 10శాతం పోస్ట్ లను అగ్ని వీరులతో భర్తీ చేస్తామని ప్రకటించింది. అంతే కాకుండా సాధారణంగా ఉండే వయోపరిమితి కంటే మూడేళ్లు సడలింపు ఇస్తామని స్పష్టం చేసింది.
ఏపీ లో కూడా అగ్నిపత్ కు వ్యతిరేఖంగా నిరసన చేపట్టాలని ఆర్మీ అభ్యర్థులు నిర్ణయం తీసుకున్నారు. విజయవాడ, గుంటూరు, విశాఖ జిల్లాల్లో నిరసనలు సిద్దం అవ్వడంతో పోలీసులు ఇప్పటికే అప్రమత్తం అయ్యారు.