Home » june 16th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

june 16th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad

మోడీ సర్కార్ పై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. మోడీ సర్కార్ ప్రతిపక్ష నాయకులను టార్గెట్ చేస్తుందని కేటీఆర్ ఆరోపించారు. ఈడి, సిబిఐ లాంటి దర్యాప్తు సంస్థలతో ప్రతిపక్ష నాయకులపై కేంద్రం దాడులు చేస్తున్నారని ఆరోపించారు.

Advertisement

 

ప్రపంచానికి చైనా మరో షాకింగ్ న్యూస్ చెప్పింది. చైనాకు చెందిన టెలిస్కోప్ స్టేషన్ స్కై ఐ అనుమానిత ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ సిగ్నల్స్ ను గుర్తించింది. వాటిని ఏలియన్స్ పంపించి ఉండవచ్చుననే అనుమానం వ్యక్తం చేస్తోంది. ఇలాంటి సిగ్నల్స్ ఎప్పుడూ చూడలేదని చైనా తెలిపింది. ప్రస్తుతం దీనిపై పరిశోధనలు జరుగుతున్నాయి.

 

మధ్యప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక రాష్ట్రాలలో ప్రభుత్వరంగ సంస్థల కు చెందిన పెట్రోల్ బంక్ లలో ఒక్కసారిగా రద్దీ పెరిగింది. డిమాండ్ పెరగడంతో కొన్నిచోట్ల ఇంధన కొరత ఏర్పడినట్లు తెలుస్తోంది.

corona omricon

corona omricon

భారత్‌లో మరోసారి కరోనా కేసులు భారీగా పెరిగాయి. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 12,213 కొత్త పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 11 మంది కరోనా తో మరణించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 58,215 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Advertisement

 

హైదరాబాద్ లో నకిలీ ఫింగర్‌ ప్రింట్స్‌ తయారీ ముఠా గుట్టురట్టు అయ్యింది. సైబరాబాద్ పోలీసులు ఏడుగురిని అరెస్ట్‌ చేశారు. నకిలీ ఫింగర్‌ ప్రింట్స్‌ కేటుగాళ్లు బ్యాంకుల నుంచి ప్రజల డబ్బులు కొట్టేస్తున్నారు.

 

బాసర ట్రిపుల్‌ ఐటీ దగ్గర పోలీసులు ఆంక్షలు విధించారలరు. విద్యార్థులు ప్రధాన గేటు వద్దకు రాకుండా బారికేడ్లను ఏర్పాటు చేశారు.

 

నైరుతి రుతువపనాల ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, నల్గొండ, ఆసిఫాబాద్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. 24 గంటల్లో అత్యధికంగా రంగారెడ్డి జిల్లా సంగంలో 16 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదయ్యింది.

 

 

కాంగ్రెస్ పార్టీ నేడు చలో రాజ్‌భవన్‌కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో నేడు సోమాజిగూడ నుండి రాజ్‌భవన్‌ వరకు కాంగ్రెస్‌ నేతలు ర్యాలీగా వెళ్లనున్నారు.

 

ఐపీఎస్ టీ. శ్రీనివాస్ రావుకు తెలంగాణ ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతం సీఐడీలో కీలక బాధ్యతలు చూస్తున్న శ్రీనివాస్ రావును సైబరాబాద్ ట్రాఫిక్ డిప్యూటీ కమిషనర్‌గా నియమించింది. గతంలో మాజీ గవర్నర్ నరసింహన్‌ మూడున్నరేళ్ల పాటు ఏడీసీగా వ్యవహరించారు.

 

నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని శుక్రవారం మరోమారు విచారణకు హాజరు కావాలని ఈడీ ఆదేశించింది. గత మూడురోజులుగా రాహుల్ గాంధీ ఈడి విచారణకు హాజరవుతున్నారు.

Visitors Are Also Reading