Home » june 15th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

june 15th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad

బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 960 రూపాయలు తగ్గి 47,400 కి చేరుకుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 50,720 రూపాయలకు చేరుకుంది.

Advertisement

హైదరాబాద్ బేగంపేట మెట్రో స్టేషన్ వద్ద ట్రాఫిక్ పోలీసుల పై మందుబాబులు దాడిచేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ ముగ్గురు యువకులు పోలీసులతో గొడవకు దిగి వారిపై దాడి చేశారు. దాంతో వెంటనే ఆ ముగ్గురిని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

ఏపీలో డిగ్రీ చదివే విద్యార్థుల కోసం మరో 11 కొత్త కోర్సులను ప్రవేశపెట్టారు. 20 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బిఎ టూరిజం, హాస్పిటాలిటీ, హెల్త్ కేర్ మేనేజ్మెంట్, డిజిటల్ మార్కెటింగ్ తో పాటు మరికొన్ని కోర్సులను ప్రవేశపెట్టారు.

జగిత్యాలలో ప్రభుత్వ మెడికల్ కాలేజీకి నేషనల్ మెడికల్ కమిషన్ అనుమతి ఇచ్చింది. మౌలిక వసతుల కల్పన, ఇతర ఫార్మాల్టీస్ పూర్తి చేస్తే ఈ విద్యా సంవత్సరం నుంచే ఎంబీబీఎస్ తరగతులు నిర్వహించు కోవచ్చని నేషనల్ మెడికల్ కమిషన్ స్పష్టం చేసింది.

విశాఖలో నిన్న జరిగిన ఐదు టీ20 మ్యాచ్ ల సిరీస్‌లో భారత్ బోణీ కొట్టింది. మూడో టి20లో 48 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. ఇప్పటికే సౌతాఫ్రికా రెండు మ్యాచ్ లు గెలిచిన సంగతి తెలిసిందే.

Advertisement

 

నిన్న ఉదయం తొలివిడతగా నాలుగున్నర గంటల పాటు రాహుల్ గాంధీని ఈడి విచారించింది. సాయంత్రం నుంచి రాత్రి వరకు 4 గంటల పాటు విచారణ కొనసాగింది. ఇవాళ మొత్తం 8గంటలకు పైగా ఈడీ విచారణ జరపనుంది. సోమవారం పదిన్నరగంటల పాటు విచారణ జరిగింది. రెండురోజుల్లో 19 గంటల పాటు విచారణ జరిగింది.

కరోనా పై తెలంగాణ సర్కార్ అప్రమత్తం అయ్యింది. దగ్గు, జలుబు ఉన్నవారికి ఆర్టీపీసీఆర్ తప్పనిసరి చేస్తూ వైద్యశాఖ ఉత్తర్వులు జారీచేసింది. పీహెచ్సీ టూ టీచింగ్ హాస్పిటల్స్ వరకు కేసులు పెరగడంతో ఆరోగ్య శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది.

మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మేజర్ సినిమాను స్కూల్ పిల్లల కోసం టికెట్ ధరపై 50 శాతం రాయితీ ఇవ్వాలని నిర్ణయించారు.

టిడిపి అధినేత చంద్రబాబు ఈరోజు నుండి జిల్లాల బాట పట్టనున్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తి చంద్రన్న భరోసా పేరుతో జిల్లాల పర్యటనలు కొనసాగుతాయి. ఒక్కో జిల్లాలో చంద్రబాబు పర్యటన కోసం మూడు రోజులు కేటాయిస్తున్నారు.

Visitors Are Also Reading