Home » July 9th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

July 9th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో గత రాత్రి భారీ వర్షం కురిసింది. రాత్రి 10 గంటల వరకు అత్యధికంగా రామంతాపూర్‌లో 4.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. మాదాపూర్‌లో 4.1, హఫీజ్‌పేట్‌లో 3.6, చార్మినార్‌లో 2.8, సరూర్‌నగర్‌, ఎల్బీనగర్‌లో 2.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది.

Advertisement

అమర్ నాథ్ లో ప్రమాదం పై ప్రధానికి మోడీ జమ్మూకాశ్మీర్ అధికారులకు ఫోన్ చేసి అరా తీశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు.

అమర్ నాథ్ యాత్ర ప్రమాదం పై ఎమ్మెల్యే రాజా సింగ్ స్పందించారు. తన ముందే వరద వచ్చిందని ఒక్కసారిగా చాలా మంది కొట్టుకుపోయారని చెప్పారు.

భద్రాద్రి కొత్తగూడెం ఇల్లందు లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల వరద భీవత్సం సృష్టించింది. కోయాగూడెం ఓసి 2 గనిలో భారీగా వరద నీరు చేరడం తో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది.

హీరో విక్రమ్ గుండె పోటుతో ఆస్పత్రిలో చేరినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆస్పత్రి యాజమాన్యం ఆయన చాతీ నొప్పితో ఆస్పత్రిలో చేరారు అని ఆయనకు గుండెపోటు రాలేదని స్పష్టంచేసింది. మరోవైపు ఆయన 11వ తేదీన ఓ సినిమా ఫంక్షన్ లు హాజరుకాబోతున్నట్టు ప్రకటించారు.

Advertisement

తెలంగాణ లోని 14జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. హైదరాబాద్ కు రెడ్ అలర్ట్ జారీ చేసింది.

తెలంగాణలో రెవెన్యూ శాఖ సమ్మెకు రెడీ అవుతోంది. వీఆర్ఏ లు తమకు డిమాండ్లను పరిష్కరించాలని ఈనెల 11 నుండి రోజుకో జిల్లా సమావేశం.. 15 నుండి 22 వరకు కలెక్టరేట్ ల ముందు నిరాహార దీక్షలు చేపడుతున్నారు. 25 నుండి సమ్మెలోకి దిగుతున్నట్టు జెఎసి ప్రకటించింది.


తెలంగాణలో దళిత బంధు పథకంలో మంజూరైన వాహనాలు దళారులు అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లకుండా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దళిత బంధు కింద ఇచ్చే వాహనాలను ఐదేళ్లపాటు విక్రయించకుండా ఎస్సీ కార్పొరేషన్ తాకట్టులో పెట్టింది.

ఎలాన్ మస్క్ పై దావా వేస్తామని ట్విట్టర్ ప్రకటించింది. ట్విట్టర్ కొనుగోలు డీల్ ను రద్దు చేసుకుంటున్నట్టు ఎలాన్ ప్రకటించారు. ఈ నిర్ణయం పై ట్విట్టర్ దావా వేయాలని నిర్ణయించింది.

ఏపీలో 2022-23 విద్యాసంవత్సరం కోసం కొత్త ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా ప్రతినెలా రెండో శనివారం సెలవు ఇవ్వగా ఈ నెల నుండే అమలు కానుంది.

Visitors Are Also Reading