రేణిగుంట చెక్ పోస్ట్ లో ఏసీబీ దాడులు నిర్వహిస్తోంది. రూ.1.50 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ అదుపులో మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్ తో పాటు కానిస్టేబుల్ ఉన్నారు.
కోనసీమ జిల్లా టీడీపీ మాజీ ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి మృతి చెందారు. తెల్లవారుజామున గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. నారాయణమూర్తి చికిత్స పొందుతూ మృతి చెందారు.
Advertisement
హైదరాబాద్ లో మరోమారు చెడ్డీగ్యాంగ్ హల్ చల్ చేసింది. హయత్ నగర్ కుంట్లూర్ లో చెడ్డిగ్యాంగ్ రెచ్చిపోయింది. ప్రజయ్ గుల్మోహర్ గేటెట్ కమ్యూనిటీలో చోరీ చేసింది. ఐదు ఇళ్ళల్లో ఏడుగురు సభ్యుల ముఠా చోరికి పాల్పడినట్టు సమాచారం.
ఆరు రోజుల క్రితం తప్పి పోయిన జాలర్ల జాడ ఇంకా దొరకలేదు. 6రోజులు గా సముద్రంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు ఆరు బోట్లతో పాటు ఒక హెలికాప్టర్ తో గాలింపు కొనసాగిస్తున్నారు. నేడు మచిలీపట్నం నుండి మరో రెండు బోట్లతో గాలింపు జరపనున్నారు. డ్రోన్ కెమెరాలను సైతం అధికారులు సిద్దం చేసారు.
Advertisement
కర్నూలు కోసిగిలో చిరుత పులి కలకలం రేపింది. గత కొంత కాలంగా గ్రామ సమీపంలో ఉన్న కొండల్లో చిరుతపులి సంచారం చేస్తోంది. మేకలు, గొర్రెలు, కుక్కలను చిరుత పులి చంపి తింటున్నట్టు సమాచారం. దాంతో పొలాలకు వెళ్లాలంటే రైతులు భయపడిపోతున్నారు. చిరుత పులి సంచరిస్తున్నా ఫారెస్ట్ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు.
ఏపీకి రూ.879.08 కోట్ల రెవెన్యూ లోటు నిధులను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. నాలుగో విడత కింద 14 రాష్ట్రాలకు రూ.7,183.42 కోట్లు రెవెన్యూ లోటు నిధులు విడుదల చేసింది. వాటిలో భాగంగా ఏపీకి రూ.879.08 కోట్లు విడుదల చేసింది.
కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, సింధియాకు అదనపు బాధ్యతలు అప్పగించారు. స్మృతి ఇరానీకి మైనార్టీ సంక్షేమం, జ్యోతిరాదిత్య సింధియాకు ఉక్కు, గనుల శాఖ బాధ్యతలు అప్పగించారు.
తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగిపోయింది. దాంతో శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతుంది.
దక్షిణాది నుండి ప్రముఖులను కేంద్రం రాజ్యసభ కు నామినేట్ చేశారు. వారిలో ఇళయరాజా, పీటీ ఉష, విజయేంద్రప్రసాద్, వీరేంద్ర హెగ్డే ఉన్నారు.