Home » July 6th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

July 6th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad
corona omricon

corona omricon

భారత్‌లో కొత్తగా 16,159 కరోనా కేసులు నమోదయ్యాయి. 28 మంది కరోనా తో మృతి చెందారు. దేశంలో ప్రస్తుతం 1,15,212 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

మరోసారి కేంద్రం గ్యాస్‌ సిలిండర్‌ ధరను పెంచింది. గృహ వినియోగ సిలిండర్‌పై రూ.50 పెంచారు. దాంతో సిలిండర్ ధర రూ.1055 నుంచి రూ.1105కి చేరుకుంది.

Advertisement

పాతబస్తీలో ఎన్‌ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. బీహార్‌కు చెందిన ఓ వ్యక్తిని ఎన్‌ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, సికింద్రాబాద్‌, బోయిన్‌పల్లి, బేగంపేట్‌, కొండాపూర్‌, గచ్చిబౌలి, మాదాపూర్‌, నాంపల్లి, అబిడ్స్, కోఠి, బషీర్‌బాగ్, ఖైరతాబాద్‌ సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది.

సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. భూసమస్యల పరిష్కారానికి రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 15 వ తేదీ నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నారు. మండలం కేంద్రంగా 3 రోజులకు ఒక మండలం చొప్పున 100 బృందాలను ఏర్పాటు చేసి జాయింట్ కలెక్టర్, డీఆర్వో, ఆర్డీవోల ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే నేతృత్వంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని.

Advertisement

సీజనల్‌ వ్యాధులపై మంత్రి హరీష్‌రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. సీజనల్‌ వ్యాధులపై మూడంచెల వ్యూహం రంచించారు. ప్రజల్లో అవగాహన, పరీక్షలు, చికిత్స అందించడం వ్యూహంగా సాగాలని అన్నారు. అవసరమైన చోట మెడికల్‌ క్యాంపులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

అగ్నివీరుల కోసం విశాఖలో ఆగస్టు 14 నుంచి 31 వరకు ఎంపిక ప్రక్రియ జరుగుతుందని రక్షణ శాఖ ప్రకటించింది. ఈ నెల 30 లోగా రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ నిర్వహిస్తామని…. ఆన్‌లైన్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని స్పష్టం చేసింది.

జనసేన బీజేపీతో కలిసే ఉందని ఏపీ బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అందులో ఎలాంటి సందేహం లేదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కలిసే పోటీచేస్తామని ప్రకటించారు. మోడీ సభను విజయవంతం చేయాలని., పవన్‌ కల్యాణ్ వీడియో సందేశం కూడా ఇచ్చారని పేర్కొన్నారు.

ఇంటర్ జవాబు పత్రాల రీ వెరిఫికేషన్ కోసం భారీ సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రికి 17,995 జవాబు పత్రాలకు సంబంధించిన దరఖాస్తులు అందాయి.

తమిళనాడుకు చెందిన కాంగ్రెస్ ఎంపీ విజయ్ వసంత్ తన పెన్ను పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ పెన్ను ధర 1.5 లక్షల పైనే ఉంటుందని తెలిపారు. ఆ పెన్ను చనిపోయిన తన తండ్రి బతికున్నప్పుడు గిఫ్ట్ గా ఇచ్చారని చెప్పారు.

Visitors Are Also Reading