ఇవాళ ఏబీవీపీ బంద్ నేపథ్యంలో కొన్ని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు సెలవు ప్రకటించాయి.
సీఎం జగన్ నేడు తాడేపల్లి నుంచి కర్నూలు జిల్లా ఆదోనికి బయలుదేరారు. అక్కడ విద్యా కానుక కిట్లను సీఎం పంపిణీ చేయనున్నారు.
Advertisement
నేటి నుంచి ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం నామినేషన్ల స్వీకరణ జరగనుంది. ఆగస్టు 6 న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. ఆగస్టు 10వ తేదీతో ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పదవీ కాలం ముగియనుంది.
శ్రీకాళహస్తి ముక్కంటి సన్నిధిలో ఎసి కంప్రైషర్ పేలింది. భారీ శబ్దం రావడంతో భక్తులు ఆందోళన కు గురయ్యారు. ఎవరికి ఏమీ కాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
తొలిసారి శ్రీవారి హుండీ ఆదాయం రూ.6 కోట్ల మార్క్‌ను దాటింది. నేడు శ్రీవారి హుండీ ఆదాయం రూ.6.18 కోట్లకు చేరింది.
Advertisement
బాలీవుడ్ హీరో సుశాంత్‌సింగ్ రాజ్ పుత్ కేసులో అనుమానితుడు గా అరెస్ట్ అయిన హైదరాబాద్ వాసికి ఊరట లభించింది. సుశాంత్ రూమ్‌మేట్ సిద్ధార్థ పితానికి బెయిల్ మంజూరు అయ్యింది. సిద్దార్థ్ ను గత ఏడాది మే నెలలో అరెస్ట్ చేశారు.
ఆపరేషన్ ఆకర్ష్‌పై స్పీడ్ పెంచాలని బీజేపీ నిర్ణయం తీసుకుంది. ముఖ్య నేతలకు బాధ్యతలు అప్పగించాలని బీజేపీ ఆలోచనలో పడినట్టు సమాచారం. ఈటల రాజేందర్‌కు అప్పగిస్తే చేరికలు ఎక్కువగా ఉంటాయని బీజేపీ భావిస్తోంది.
జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ పై సోమవారం అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో మంగళ బుధవారంలో పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
సీఎం జగన్ ను చూసి కేసీఆర్ నేర్చుకోవాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సూచించారు. ప్రధానిని ఏ విధంగా గౌరవించాలో జగన్ చూసి కేసీఆర్ నేర్చుకోవాలని అన్నారు.
40% అంగవైకల్యం ఉన్న దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఎలాంటి షరతులు లేకుండా వారికి రేషన్ కార్డులను జారీ చేయాలని నిర్ణయించింది.