Home » July 4th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

July 4th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad

తెలంగాణకు కేంద్రం ఏమిచ్చిందో శ్వేతపత్రం ఇవ్వాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణలో దేవాలయాల అభివృద్ధికి ఎన్ని నిధులిచ్చారో చెప్పాలన్నారు. సింగిల్ ఇంజన్ సర్కార్‌తోనే అన్నీ అభివృద్ధి చేస్తున్నాం.. సీఎం కేసీఆర్ ప్రశ్నలకు మోదీ సమాధానం ఇవ్వలేదన్నారు.

హిమాచల్ ప్రదేశ్‌ కులు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. బస్సు లోయలో పడటం తో 20 మంది మృతి చెందారు. పలువురికి గాయాలు అయ్యాయి

Advertisement

modi

ప్రధాని మోడీ హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం బయలుదేరారు. గన్నవరం ఎయిర్‌పోర్టులో ప్రధాని మోదీకి గవర్నర్ హరిచందన్, సీఎం జగన్ ఘన స్వాగతం పలికారు.

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు మెగాస్టార్ చిరంజీవి భీమవరం చేరుకున్నారు. చిరంజీవికి మెగా అభిమానులు గజమాలలతో ఘనస్వాగతం పలికారు.

హైదరాబాద్ వనస్థలిపురం ఆటోనగర్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఆయిల్ ట్యాంకర్‌లో మంటలు చెలరేగాయి. చౌటుప్పల్ నుంచి ఆటోనగర్ వైపు వస్తుండగా ఈ ఘటన ఘటన చోటు చేసుకుంది. ఫైర్ సిబ్బందిఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు.

Advertisement

ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ఈరోజు నుండి రాష్ట్రాల పర్యటన కు వెళ్లనున్నారు. నేడు ద్రౌపది ముర్ము జార్కండ్ లో…రేపు బీహార్‌లో పర్యటించనున్నారు.

నరేంద్ర మోడీ చీకటి మిత్రుడు కేసీఆర్ అంటూ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. మోడీ మిత్రధర్మం పాటించారు. కుటుంబ పాలన, అవినీతి ఊసెత్తకుండా…మాట్లాడి వెళ్ళారు అంటూ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.

మంచిర్యాల జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో బొగ్గు ఉత్పత్తిని సింగరేణి నిలిపివేసింది. భారీ వర్షాల కారణంగా జిల్లాలోని పలు ఓపెన్ క్యాస్ట్ లలో బొగ్గు ఉత్పత్తిని నిలిపివేసింది.

ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఈ ఏడాది నుండి జగనన్న గోరుముద్ద పథకం కింద మధ్యాహ్న భోజనంతో పాటు వారంలో ఐదు రోజుల పాటు కోడిగుడ్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. మూడు రోజులు పల్లి పట్టి అందించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

హీరో కమల్ హాసన్ కు తమిళనాడు ప్రభుత్వం నోటీసులు అందించినట్టు తెలుస్తోంది. రోడ్డు నిర్మాణ పనుల్లో భాగంగా కమల్ హాసన్ ఇంటిలో కొంత భాగాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం నోటీసులు ఇచ్చినట్టు సమాచారం.

Visitors Are Also Reading