ప్యారిస్ పర్యటన ముగించుకుని సీఎం వైఎస్ జగన్ ఏపికి చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయంలో సీఎం వైఎస్ జగన్‌కు మంత్రి జోగి రమేష్, సీఎస్ సమీర్ శర్మ, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్ లు స్వాగతం పలికారు.
సమ్మె విరమిస్తున్నట్లు సీనియర్ రెసిడెంట్ వైద్యులు ప్రకటించారు. విధుల్లో కొనసాగుతామని వైద్యులు స్పష్టం చేశారు. సమస్యలు పరిష్కరించేందుకు మంత్రి హరీష్‌రావు హామీ ఇవ్వడం తో సమ్మెను విరమించుకున్నారు.
Advertisement
వీఐపీల పర్యటన కారణంగా నేడు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేస్తున్నారు. మాదాపూర్, హెచ్‌సీసీ, పంజాగుట్ట, బేగంపేట, ఖైరతాబాద్ ప్రాంతాలలో వాహనాలను దారి మళ్లిస్తున్నారు.
ఈరోజు సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో బీజేపీ విజయ సంకల్ప సభ ప్రారంభం కానుంది. ప్రధాని మోదీ, జేపీ నడ్డా, పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, తెలంగాణ బీజేపీ నేతలు ఈ సభకు భారీ ఎత్తున హాజరుకానున్నారు.
Advertisement
యాదాద్రి జిల్లా పగిడిపల్లి వద్ద రైలులో మంటలు చెలరేగాయి. పార్శిల్ బోగీలో మంటలు చెలరేగాయి. సికింద్రాబాద్ నుంచి ఢిల్లీ వెళ్తున్న రైలులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేశారు.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్ లో రేపటి ప్రధాని మోడీ బహిరంగ సభకు ప్రత్యేక రైలును ఏర్పాటు చేశారు. 18 బోగీల రైలులో బీజేపీ కార్యకర్తలు, నాయకులు బయలుదేరారు.
హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్ లో వర్షం కురుస్తోంది.
హైదరాబాద్ నగరంలో పోస్టర్ల గొడవ కొనసాగుతోంది. మెట్రో పిల్లర్లపై అంటించిన కేసీఆర్ ఫోటోలపై బీజేపీ కార్యకర్తలు మోడీ బొమ్మలు అంటించారు. మనీ హెయిస్ట్ పేరుతో బీజేపీకి వ్యతిరేకంగా పోస్టర్లు పెట్టారు. మోడీ ఫోటోల పక్కన ఆయనకు వ్యతిరేకంగా అచ్చేదిన్ బిస్కెట్ ప్యాకెట్ ఫోటోలను ఏర్పాటు చేశారు.
ఏపీలో గ్రామ వార్డు వాలంటీర్లకు ప్రతినిలా రెండు వందల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎక్కువ సర్క్యులేషన్ ఉన్న వార్తాపత్రికను కొనుక్కునేందుకు ఈ డబ్బులను అందిస్తోంది.
హైదరాబాద్ నగరంలో బిజెపి టీఆర్ఎస్ పోటాపోటీగా ప్లెక్సీలు ఏర్పాటు చేసిన సంఘటన తెలిసిందే. దాంతో జిహెచ్ఎంసి ఈ రెండు పార్టీలకు ఫైన్ విధించింది. బిజెపికి రూపాయలు 20 లక్షల ఫైన్ విధించగా టిఆర్ఎస్ కు మూడు లక్షల ఫైన్ విధించారు.