Home » Aug 1st 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

Aug 1st 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad

అమెరికాలో మంకీపాక్స్‌ వ్యాప్తితో న్యూయార్క్‌లో హెల్త్‌ ఎమర్జెన్సీ విధించింది. న్యూయార్క్‌లో ఇప్పటి వరకు 1,400 మంకీపాక్స్‌ కేసులు నమోదు అయ్యాయి.

 

నేడు చికోటి ప్రవీణ్‌ ఈడి ముందుకు హాజరు కానున్నారు. హవాలా లావాదేవీలపై అధికారులు ప్రశ్నించే అవకాశం ఉంది.

Advertisement

 

హైదరాబాద్‌ లోని మాదాపూర్‌లో కాల్పుల కలకలం రేగింది. గొడవలో రియల్‌ఎస్టేట్‌ వ్యాపారి ఇస్మాయిల్‌ మృతి చెందాడు. జహంగీర్‌కు తీవ్రగాయాలయ్యాయి. ఇస్మాయిల్‌పై పాయింట్‌ బ్లాంక్‌లో రౌడీషీటర్ జహంగీర్ గన్ పెట్టి కాల్పులు జరిపాడు. ఇస్మాయిల్‌, జహంగీర్‌, మహ్మద్‌ల మధ్య రియల్‌ ఎస్టేట్‌ వివాదం ఉన్నట్టు తెలుస్తోంది.

ఈరోజు నుంచి తెలుగు సినిమా షూటింగ్స్‌ బంద్ కానున్నాయి. గత కొద్ది రోజులుగా టికెట్స్ ధర ఇతర విషయాల్లో అసంతృప్తి తో ఫిల్మ్ ఛాంబర్ ఈ నిర్ణయం తీసుకుంది.

జూలై మాసంలో శ్రీవారికి రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం వచ్చింది. టీటీడీ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా స్వామివారికి రూ.139.45 కోట్ల హుండీ ఆదాయం వచ్చినట్టు సమాచారం.

Advertisement

హైదరాబాద్‌లో గత రాత్రి మరోసారి కుండపోత వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, ఎస్ఆర్ నగర్, కూకట్‌పల్లి, దిల్‌సుఖ్ నగర్, ఎల్బీనగర్, వనస్థలిపురంలో భారీ వర్షం కురిసింది. దాంతో రోడ్లు జలమయం అవ్వడం వల్ల పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించి పోయింది.

ప్రముఖ బెంగాలీ సింగర్ నిర్మలా మిశ్రా (81) కన్నుమూశారు. ఒడియా, బెంగాలీ భాషల్లో పలు సినిమాలకు పాటలు పాడిన నిర్మలా మిశ్రా వృద్ధాప్యం తో చనిపోయారు.

ఈడీ అదుపులో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఉన్నారు. రూ.వెయ్యి కోట్లకు పైగా జరిగిన పత్రాచల్ భూ కుంభకోణం కేసులో ఆదివారం ఉదయం నుంచి సంజయ్ రౌత్ ఇళ్లలో ఈడీ దాడులు నిర్వహించింది. ఈ కేసులో సంజయ్ రౌత్ పాత్రపై ఈడి విచారణ కొనసాగిస్తోంది.

modi

ఆగస్టు 15న ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ జెండా ఎగురవేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. మోదీ ప్రధాని కావడం దేశానికే వరమని అన్నారు. మోదీ 8 ఏళ్లుగా ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదని…..కేసీఆర్ ఒక్కరోజు కూడా సచివాలయానికి రాలేదని విమర్శించారు. నెలలో 20 రోజులు కేసీఆర్ ఫాంహౌస్‌లోనే ఉంటారని కామెంట్స్ చేశాడు.

కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ కూతురు తనియా రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఐ20 కారులో రోడ్డుపై వెళుతుండగా శంషాబాద్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తనియ మృతి చెందారు.

Visitors Are Also Reading