నేడు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ విశాఖ పర్యటనకు విచ్చేస్తున్నారు. రవిశాస్త్రి శతజయంతి వేడుకల్లో జస్టిస్ ఎన్వీ రమణ పాల్గొంటారు.
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు తొలి స్వర్ణం వచ్చింది. వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను తొలి స్వర్ణ పథకాన్ని కైవసం చేసుకుంది. 49 కిలోల విభాగంలో మీరాబాయికి స్వర్ణం లభించింది.
Advertisement
రేపటి నుండి 10 వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. 55 వేల 662 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఈ పరీక్షల కోసం మొత్తం 204 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.
పీసీసీల ఆధ్వర్యంలో రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమానికి కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, సీనియర్ కాంగ్రెస్ లీడర్లు ఈ ముట్టడి లో పాల్గొంటారు. జిల్లా కేంద్రాల్లో ఆందోళనలు, కలెక్టరేట్ ల ముట్టడి, ప్రధాని ఇంటి ముట్టడిలో పాల్గొననున్న CWC సభ్యులు, జాతీయ నేతలు పాల్గొనే అవకాశం ఉంది.
కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అధ్యయనానికి తెలంగాణ నుండి ఓ బృందం బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ క్రీడలకు వెళుతోంది. తెలంగాణ నుంచి క్రీడా మంత్రి శ్రీనివాస్ గౌడ్, శాట్స్ చైర్మన్ రెడ్డి నేతృత్వంలో బృందం ఆగస్టు 2వ తేదీన హైదరాబాద్ నుంచి పయనం కానుంది.
Advertisement
ప్రకృతి వైద్యానికి కేరాఫ్ గా హైదరాబాద్ మార్చాలనే ఆలోచనా ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం.10 ఎకరాలలో నేచర్ క్యూర్ హాస్పిటల్ అభివృద్ధి చేయబోతున్నట్టు తెలుస్తోంది. సదుపాయాల కల్పన కోసం రూ.6 కోట్లను విడుదల చేసి వెంటనే పనులు ప్రారంభించాలని అధికారులకు మంత్రి హరీశ్ రావు ఆదేశాలు జారీ చేశారు.
ఆషాడమాసం ముగిసి శ్రావణంలోకి అడుగుపెట్టడంతో మళ్లీ పెళ్లి బాజాలు మోగనున్నాయి. దాదాపు ఆగస్టు నెలలో 21వ తేదీ వరకు మంచి ముహూర్తాలు ఉన్నాయి.
తెలంగాణలో ఆగస్టు 4వ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణం కేంద్రం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో 20 జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
దేశంలో గడిచిన 24 గంటల్లో 19,673 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. 24 మంది కరోనా తో మృతి చెందారు.
శివసేన రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ ఇంట్లో ఈడి సోదాలు నిర్వహిస్తోంది. పత్రాచల్ భూ కుంభకోణం కేసులో ఆరోపణలు రావడంతో ఈడి సోదాలు నిర్వహిస్తోంది.