Home » July 2nd 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

July 2nd 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad

modi

హైదరాబాద్‌ లోని హెచ్‌ఐసీసీ వద్ద హైఅలర్ట్ ప్రకటించారు. ప్రధాని, కేంద్ర హోంమంత్రి రాకతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వివిధ రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రుల పర్యటనతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

Advertisement

Pawan kalyan

Pawan kalyan

నేడు ఏపీకి జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ వెళ్లనున్నారు. జనసేన క్రియాశీలక సభ్యులైన వీర మహిళల శిక్షణా తరగతుల్లో పవన్ పాల్గొంటారు.

తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ మధ్యాహ్నం 2.55కి బేగంపేట్‌ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. అక్కడ నుండి ప్రత్యేక హెలికాప్టర్‌లో మధ్యాహ్నం 3.20కి హెచ్‌ఐసీసీకి చేరుకుంటారు.

నేడు పాతబస్తీకి యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ వస్తున్నారు. మధ్యాహ్నం 12.30కు యోగి ఆదిత్యనాత్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోనున్నారు.

Advertisement

ఈరోజు విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్ కు విచ్చేస్తున్నారు. ఉదయం 11 గం.లకు బేగంపేటలో టీఆర్ఎస్ అధ్యక్షులు, సీఎం కేసీఆర్ ఆయనకు స్వాగతం పలకనున్నారు. బేగంపేట్ నుంచి టీఆర్ఎస్ శ్రేణులతో భారీ బైక్ ర్యాలీ నిర్వించనున్నారు. 12:30 కు బేగంపేట జలవిహార్ లో కేసీఆర్ ప్రసంగిస్తారు.

ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మాజీ ఎంపీ మందా జగన్నాథంను సీఎం కేసీఆర్ నియమించారు. ఆయనకు క్యాబినెట్ మంత్రి హోదాతో రెండేళ్ళ పదవీకాలం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు.

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ప్రభుత్వ బాలుర హాస్టల్ లో కరోనా కలకలం రేగింది. పదిమంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. ఒక విద్యార్ధి ఆరోగ్యం బాగా లేకపోవడంతో పరీక్షలు నిర్వహించారు దాంతో 10మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ వచ్చిన విద్యార్ధులను క్వారంటైన్ కు తరలించారు.

హైదరాబాదులో బై బై మోడీ అంటూ టిఆర్ఎస్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు కాంగ్రెస్ కూడా బై బై కేసీఆర్… బై బై మోడీ అంటూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది.

జులై 20వ తేదీన బక్రీద్ పండగ జరుపుకోవాలని ముస్లిం మత పెద్దలు ప్రకటించారు. నెలవంక కనిపించిందని ప్రార్థనల కోసం వచ్చేవారు మాస్కులు తప్పకుండా ధరించాలని సూచించారు.

Visitors Are Also Reading