హైదరాబాద్ జంట నగరాల్లో అర్ధరాత్రి భారీగా కురిసిన వర్షానికి పలు కాలనీలు నీట మునిగాయి. ముసారాంబాగ్ వంతెన పైనుంచి ప్రవహిస్తున్న వరద నీరు ప్రవిస్తోంది. ముసారాంబాగ్-గోల్నాక మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
Advertisement
సీఎం జగన్ నేడు అంబేద్కర్ కోనసీమ జిల్లా పర్యటించనున్నారు. గోదావరి వరద ప్రాంతాల్లో పర్యటించి బాధితుల సమస్యలను తెలుసుకోనున్నారు.
నేటి నుంచి 5జీ స్పెక్ట్రమ్ వేలం నిర్వహించనున్నారు. వేలంలో జియో, ఎయిర్టెల్, అదానీ గ్రూప్ సంస్థలు పాల్గొంటున్నాయి. ప్రస్తుత ఇంటర్నెట్ కంటే 10 రెట్లు వేగంగా డేటా సేవలు అందించనున్నారు. కొనుగోలు చేసిన సంస్థలు 20 ఏళ్ల పాటు సేవలను వినియోగించుకునే అవకాశం ఉంది.
తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద స్వల్పంగా వరద ప్రవాహం పెరుగుతోంది. 11.70 అడుగులకు నీటి మట్టం చేరుకుంది. 11.75 అడుగులు దాటితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది.
Advertisement
నేడు సీఎం కేసీఆర్ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలపనున్నారు.
తెలంగాణ హైకోర్టుకు కొత్త జడ్జీలుగా సుప్రీం కోర్టు కోలీజియం ఆరుగురు న్యాయవాదులను సిఫార్సు చేసింది.
సీఎం కేసీఆర్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. రెండు మూడ్రోజులు కేసీఆర్ ఢిల్లీలోనే మకాం వేయనున్నారు. ఈ పర్యటనలో భాగంగా కేసీఆర్ జాతీయ నేతలను కలవనున్నారు.
ఏపీలో మరో రెండ్రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్ని చోట్ల ఉరుములతో కూడిన వానలు, రేపు మరియు ఎల్లుండి కొన్నిచోట్ల తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది.
మరో పది రోజుల్లో ఇంటర్ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందజేస్తామని తెలంగాణ తెలుగు అకాడమీ ప్రకటించింది. పేపర్ కొరత కారణంగా పుస్తకాల ముద్రణ ఆలస్యం అయినట్టు తెలిపింది.
బీహార్ ముఖ్యంత్రి నితీష్ కుమార్ మారిన భారిన పడ్డారు. నాలుగు రోజులుగా ఆయన జ్వరం తో బాధపడుతున్నారు. దాంతో ఆస్పత్రిలో చేరారు.