Home » July 25th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

July 25th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad

ఎంసెట్ మెడికల్, అగ్రికల్చర్ పరీక్ష వాయిదా పడిన సంగతి తెలిసిందే. దాంతో విద్యార్థులకు ఈనెల 30 ,31వ తేదీల్లో తిరిగి పరీక్షను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు మరోసారి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు వెల్లడించారు.

corona omricon

corona omricon

దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 16,866 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. 41 మంది కరోనాతో మృతి చెందారు.

Advertisement

ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. సినీ నిర్మాతల కౌన్సిల్ లెటర్‌తో పాటు ఓటీటీ, వీపీఎఫ్ ఛార్జీలు, టిక్కెట్ల ధరలు, ప్రొడక్షన్ కాస్ట్‌పై చర్చ జర్చ జరగనుంది.

ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు లోటస్ పాండ్ పార్టీ కార్యాలయంలో వైఎస్ షర్మిల ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణ లో తాజా రాజకీయ పరిణామాల పై ఆమె ప్రెస్ మీట్ లో మాట్లాడనున్నారు.

Advertisement

తిరుమలలో ఆగస్టు 8 నుంచి 10 వరకు శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలు జరగనున్నాయి. ఆగస్టు 7న పవిత్రోత్సవాలకు అంకురార్పణ చేయగా టిటిడి మూడు రోజుల పాటు ఆర్జిత సేవలు రద్దు చేసింది.

నేడు రాష్ట్రపతి గా ద్రౌపతి ముర్ము ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజ్‌ఘాట్‌లో గాంధీ సమాధికి నివాళులర్పించిన అనంతరం ప్రమాణ స్వీకారం చేస్తారు.

cm kcr

cm kcr

ఇటీవల గోదావరి వరదలకు గురైన కడెం, ఎస్సారెస్పీ, కాళేశ్వరం ప్రాజెక్టులను నేడు తెలంగాణ సీఎం కేసీఆర్ పరిశీలించనున్నారు.

ఎల్లుండి కోనసీమ జిల్లాలో జరిగే సీఎం పర్యటన ఏర్పాట్లను మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ పరిశీలించనున్నారు. పి.గన్నవరం, రాజోలు నియోజకవర్గాలలో వరద ముంపు ప్రాంతాలను సిఎం జగన్ పరిశీలించనున్నారు.

ఢిల్లీలో మంకీపాక్స్ కలకలం రేపింది. ఓ వ్యక్తికి మంకీపాక్స్ సోకినట్లు గుర్తించారు. దాంతో ఇప్పటివరకు భారత్‌లో 4 మంకీపాక్స్ కేసులు నమోదయాయి కేరళలో 3, ఢిల్లీలో ఒక మంకీపాక్స్ కేసును అధికారులు గుర్తించారు.

Visitors Are Also Reading