Home » July 23rd 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

July 23rd 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad
INDIA CORONA UPDATE

INDIA CORONA UPDATE

దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా 21,411 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.

 

గండి పేట చెరువులోకి భారీగా వరద నీరు చేరింది. దాంతో అధికారులు 4 గేట్లను ఎత్తడం జరిగింది. ఇన్ ఫ్లో 2 వేల క్యూసెక్కులు ఉండగా ఔట్ ఫ్లో 832 క్యూసెక్కులుగా ఉంది.

Advertisement

న్యూఢిల్లీ రైల్వేష్టేషన్‌లో దారుణం జరిగింది. 30 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది నిందితులు రైల్వే ఉద్యోగులుగా గుర్తించి పోలిసులు అరెస్ట్ చేశారు.

హైదరాబాద్‌లో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాల తో రోడ్లపైకి వర్షపు నీరు భారీగా చేరింది. దాంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. హఫీజ్‌పేట్‌లో 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా జీడిమెట్ల, గాజులరామారంలో 13.9, బాలానగర్‌లో 12.9 సెం.మీల వర్షపాతం నమోదయ్యింది.

తెలుగు రాష్ట్రాల్లో మరో 2 రోజుల పాటు భారీవర్షాలు కురవనున్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. మహబూబ్‌నగర్‌, జనగామ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌, ఖమ్మం, వరంగల్‌, నల్గొండ, రంగారెడ్డి, మేడ్చల్‌కు ఆరెంజ్‌ అలెర్ట్‌, మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీచేసింది.

Advertisement

సూర్యాపేట జిల్లాలో వాగులో 23 మంది కూలీలు చిక్కుకోగా అధికారులు రక్షించారు. మొత్తం 23 మంది కూలీలను సహాయక బృందాలు రక్షించారు.18 గంటల రెస్క్యూ ఆపరేషన్‌ లో ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు పాల్గొన్నాయి.

నేడు యానాంలో కేంద్ర బృందం పర్యటిస్తోంది. వదర నష్టంపై క్షేత్రస్థాయిలో కేంద్ర బృందం పర్యటిస్తోంది.

హైదరాబాద్ చిక్కడపల్లిలో కాల్పుల కలకలం రేగింది. కడపకు చెందిన న్యాయవాది శివారెడ్డి గన్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. లైసెన్స్ రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

నీరవ్‌ మోడీకి చెందిన రూ. 253 కోట్ల ఆస్తులను ఈడీ ఫ్రీజ్ చేసింది. బంగారు ఆభరణాలు, వజ్రాలు, బ్యాంకు బాలెన్స్ ఫ్రీజ్ చేశారు. సింగపూర్, చైనా , హాంకాంగ్ తో పాటు ఇండియాలో ఆస్తులు సీజ్ చేశారు. నీరవ్ మోడీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి రూ.6,498 కోట్ల రుణం తీసుకుని లండన్ పారిపోయిన సంగతి తెలిసిందే.

ఉప‌రిత‌ల ఆవర్తన ద్రోణి ప్రభావంతో రెండు రోజుల పాటు వ‌ర్షాలు కురవనున్నాయి. ఉత్తర, ద‌క్షిణ తెలంగాణ జిల్లాల్లో అక్కడ‌క్కడ భారీ వ‌ర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ రోజు భారీ నుండి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంది.

Visitors Are Also Reading