Home » July 21st 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

July 21st 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY

నేడు భారత రాష్ట్రపతి ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ద్రౌపది ముర్ము, యశ్వంత్ సిన్హా ల మధ్య పోటీ నెలకొంది. పార్లమెంట్ భవనంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది.

తిరుపతి రుయా ఆసుపత్రిలో షార్ట్ సర్క్యూట్ జరిగింది. ఈ ఘటనలో వ్యాక్సిన్ కూలర్ కాలిపోయింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేశారు.

తమిళనాడులో ఎన్ ఐ ఏ సోదాలు చేస్తోంది. చెన్నై, మధురై, కోయంబత్తూరు,సేలం సహా 22 ప్రాంతాలలో సోదాలు నిర్వహిస్తోంది. ఎల్‌టీటీఈ పునరుద్ధరణ కోసం పాకిస్థాన్‌కు చెందిన గన్ రన్నర్ హాజీ సలీమ్‌తో కలిసి శ్రీలంకకు చెందిన నార్కో మాఫియా కార్యకలాపాలు చేస్తుందనే సమాచారంతో దాడులు నిర్వహిస్తోంది.

నిత్య పెళ్ళికొడుకు శివ శంకర్ బాబు అరెస్ట్ అయ్యారు. శివశంకర్ రెండు రాష్ట్రాల్లో కలిపి 13 మంది యువతులను పెళ్లి చేసుకున్నాడు. హైదరాబాద్,రాచకొండ , సంగారెడ్డి, గుంటూరు, విజయవాడ లో శివ శంకర్ బాబుపై కేసులు నమోదయ్యాయి.


సెప్టెంబర్ మాసానికి సంబంధించిన వర్చువల్ సేవా టిక్కెట్లను నేడు టిటిడి విడుదల చెయ్యనుంది.

ఢిల్లీ ఏఐసీసీ కార్యాలయం, ఈడీ కార్యాలయం వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కుంటున్న సోనియాగాంధీ నేడు ఉదయం 11 గంటలకు ఈడీ కార్యాలయానికి రానుండడంతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఢిల్లీలో పలు చోట్ల నిరసన ప్రదర్శనలు చేయాలని కాంగ్రెస్ పిలుపునిచ్చింది.

కామారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కోడలిపై అత్త పెట్రోల్ పోసి నిప్పంటించింది. కుమారుడితో ప్రేమ పెళ్లి నచ్చక అత్త ఘాతుకానికి పాల్పడింది. కోడలి పరిస్థితి విషమం గా ఉండగా బాధితురాలు నాలుగు నెలల గర్భిణీ గా సమాచారం. కాలిన గాయాల కారణంగా కడుపులోని కవలలు సైతం మృతి చెందినటు సమాచారం

Ap cm jagan

Ap cm jagan

ఈనెల 22న సాయంత్రం 4 గంటలకు సీఎం క్యాంప్ కార్యాలయంలో వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్లు సమావేశం కానున్నారు. సీఎం జగన్ జిల్లా అధ్యక్షులతో సమావేశం లో పాల్గొంటారు

తెలంగాణలో ధాన్యం సేకరణకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. నేరుగా రైతుల నుంచి ధాన్యం, బియ్యాన్ని సేక‌రించాలని ఎఫ్‌సీఐకి కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.

భారీ వర్షాల కారణంగా మిషన్ భగీరథ నీళ్ళు కలుషితం అవ్వొచ్చన్ని కాబట్టి ఎవరూ ఆ నీటిని తాగకుండా తెలంగాణ ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

Visitors Are Also Reading