Home » July 1st 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

July 1st 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad

నేడు ఉదయం 11.30 గంటలకు తెలంగాణ టెట్‌ ఫలితాలు విడుదల చేయనున్నారు. అధికారిక వెబ్ సైట్ లో ఫలితాలను అందుబాటులో ఉంచనున్నారు.

INDIA CORONA UPDATE

INDIA CORONA UPDATE

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కొత్తగా 468 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైద్యారోగ్యశాఖ అధికారులు మాస్క్ తప్పనిసరిగా వాడాలని హెచ్చరిస్తున్నారు.

Advertisement

దంతెవాడ-సుక్మా జిల్లా సరిహద్దులో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు కాల్పులు జరిగాయి కాటేకల్యాణ్ పరిధిలోని మద్జుమ్ అడవుల్లో మావోయిస్టులు, జవాన్ల మధ్య ఎదురు కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందారు.

బీజేపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్టు మాజీ ఎంపి కొండా విశ్వేశ్వర్ రెడ్డి వెల్లడించారు. కొంతకాలంగా బీజేపీ నేతలతో సంప్రదిస్తున్నట్టు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీపై విశ్వాసం పోయిందని.. టీఆర్ఎస్ ను ఎదుర్కోవాలంటే ఒక్క బీజేపీ వల్లే సాధ్యం అవుతుందని అన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

హైదరాబాద్ లో బీజేపీ సభల నేపథ్యంలో హెచ్‌ఐసీసీ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ఆంక్షలు విధించారు. జులై 3వ తేదీ వరకు 144 సెక్షన్‌ కొనసాగుతుందని స్పష్టం చేశారు.

Advertisement

బీజేపీ జాతీయ చీఫ్ జేపీ నడ్డా నేడు హైదరాబాద్ కు వస్తున్నారు. మ.3.30 గంటలకు శంషాబాద్ విమానశ్రాయంలో పార్టీ నేతలు స్వాగతం పలకనున్నారు. శంషాబాద్‌లో రోడ్ షో, సా. 6 గంటలకు హెచ్‌ఐసీసీ గొల్లకొండ ప్రాంగణంలో ఎగ్జిబిషన్‌ను ప నడ్డా ప్రారంభిస్తారు.

ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్ లో మళ్లీ ఏపీనే నంబర్‌ వన్ గా నిలిచింది. బిజినెస్‌ రిఫార్మ్స్‌ యాక్షన్‌ ప్లాన్‌ 2020లో ఏపీ టాప్ లో నిలిచింది. మొత్తం ఈ జాబితాలో కేంద్రం 7 రాష్ట్రాలను ప్రకటించింది. 4 కేటగిరీలుగా రాష్ట్రాలకు ర్యాంకులు ప్రకటించింది.

మంచిర్యాల జిల్లా చెన్నూర్‌లో ప్రధాని మోడీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సాలు మోడీ.. సంపకు మోడీ అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌ నుంచి ఫ్లెక్సీ వార్ జిల్లాకు పాకింది.

ఏపీలో నేటి నుండి ఇంటర్ తరగతులు ప్రారంభం కాలున్నాయి. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు అందరికీ క్లాసులు ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు.


పేదలకు ఉచితంగా వివాహాలు చేసేందుకు టీటీడీ ప్రారంభించిన కళ్యాణమస్తు కార్యక్రమానికి అప్లికేషన్లు స్వీకరిస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.

Visitors Are Also Reading