రికార్డుస్థాయిలో రూపాయి విలువ పతనం అయ్యింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.80.05 కు చేరుకుంది.
Advertisement
శ్రీలంక సంక్షోభంపై నేడు ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం జరగనుంది. శ్రీలంకకు భారత్ సాయం వంటి అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు.
శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి పెరుగుతోంది. ఇన్ ఫ్లో 3,31,559 క్యూసెక్కులు కాగా ఔట్ ఫ్లో 35,554 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు చేరింది. ప్రస్తుత నీటిమట్టం 872.50 గా ఉండగా తెలంగాణ విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు.
ఆర్మీ లో ప్రవేశాల కోసమని కేంద్రం తీసుకువచ్చిన అగ్నిపథ్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.
తూర్పుగోదావరి జిల్లాలో ఈ నెల 20 నుంచి మూడ్రోజుల పాటు టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు. 20 న కుక్కనూరు, వేలేరుపాడు, 21 న కూనవరం,చింతూరు, ఎటపాక, వీఆర్పురం మండలాలు, 22 న రాజోలు, పి.గన్నవరం నియోజకవర్గాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించనున్నారు.
Advertisement
ఈ నెల 21న ఢిల్లీలో రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది. రాష్ట్రపతి ఎన్నికలకు పోలింగ్ ఏజెంట్లుగా ఆర్ధిక మంత్రి బుగ్గన, శ్రీకాంత్ రెడ్డి, చీఫ్ విప్ ప్రసాద్ రాజు రాష్ట్రం తరపున హాజరుకానున్నారు
భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం తగ్గుతోంది. గోదావరి నీటిమట్టం 55.3 అడుగుల వద్ద ఉంది. మూడో ప్రమాద హెచ్చరికలు మాత్రం కొనసాగుతున్నాయి.
దేశం లో కరోనా ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 15,523 కొత్త కేసులు నమోదయ్యాయి. 20 మంది కన్నుమూశారు.
ఏపీలో అర్హత ఉండి నవరత్నాల పథకం కింద డబ్బులు అందని వారి ఖాతాల్లో నేడు డబ్బులు జమ కానున్నాయి.