Home » July 18th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

July 18th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad

తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలకు మాక్ పోలింగ్, రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగంపై సీఎం కేటీఆర్ అవగాహన కల్పించారు. అనంతరం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బస్సుల్లో అసెంబ్లీకి బయల్దేరారు.

Advertisement

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బన్నీ వాసు పెను ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో వరద బాధితులను జనసేన కార్యకర్తలతో కలిసి ఆయన పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో పడవ ప్రమాదం జరగడంతో ఆయన నీటిలో పడిపోయారు. దాంతో వెంటనే పడవ నడిపే వ్యక్తులు ఆయనను రక్షించారు.

corona omricon

corona omricon

దేశంలో 16,935 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 50 మంది కరోనా కారణంగా మృతి చెందారు.

ఏపీలో ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల దోపిడిని అరికట్టేందుకు ఏబీవీపీ బంద్ కు పిలుపునిచ్చింది. పుస్తకాలు, యూనిఫామ్ పేరుతో జరుగుతున్న దోపిడిని అరికట్టాలని ఏబీవీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.

ఆగస్టు 2న సిరిసిల్లలో తలపెట్టిన రాహుల్ గాంధీ బహిరంగ సభను వాయిదా వేయాలనే అభిప్రాయంలో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఉన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం.

Advertisement

తెలంగాణలో నేడు రేపు ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

నేటి నుంచి తెలంగాణ ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ పరీక్షలు జరగనున్నాయి. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి నో ఎంట్రీ…. తెలంగాణలో 88, ఏపీలో 19 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు.

ఈరోజు నుంచి పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. ఆగస్టు 12వ తేదీ వరకు సమావేశాలు కొనసాగనున్నాయి. పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టడానికి సర్కార్ సిద్ధం అయ్యింది.

నేడు రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్‌ జరగనుంది. పార్లమెంట్‌లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. ద్రౌపది ముర్ము, యశ్వంత్‌ సిన్హాల మధ్య పోటీ జరగనుంది. ఈ నెల 21న ఓట్లను లెక్కించనున్నారు.

సీఎం కేసీఆర్ క్లౌడ్ బరస్ట్ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. కిషన్ రెడ్డి ట్విట్టర్ లో…..అదే నిజమైతే సాక్ష్యాలు ఇస్తే సీరియస్ గా దర్యాప్తు చేయిస్తామని….. సీఎం చేసిన ఆరోపణలను కేంద్రం తీవ్రంగా పరిగణించిందనీ పేర్కొన్నారు.

Visitors Are Also Reading