ఇండియాలో మళ్లీ కరోనా కేసులు పెరిగిపోయాయి. దేశవ్యాప్తంగా కొత్తగా 16,906 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 45 మంది కరోనాతో మృతి చెందారు.
ప్రమాదకర స్థాయిలో కడెం ప్రాజెక్టుకు వరద నీరు చేరింది. ప్రాజెక్టుకు కెపాసిటీ కన్నా ఎక్కువ వరద నీరు చేరింది. 5 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. దాంతో అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు.
Advertisement
ఆరు రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాల వల్ల సింగరేణిలో 9 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగింది. కొత్తగూడెంలో ఇప్పటి వరకు 53 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.
శ్రీలంక నుంచి అధ్యక్షుడు రాజపక్సే పారిపోయారు. మిలటరీ విమానంలో మొత్తం 15 మంది కుటుంబ సభ్యులతో మాల్దీవులకు పారిపోయారు నలుగురు అన్నదమ్ములు, కొడుకు నికల్ సహా అందరూ పారిపోయినట్టు సమాచారం.
ఈనెల 17న అఖిలపక్ష సమావేశం జరగనుంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలపై చర్చించనున్నారు.
Advertisement
అమర్నాథ్ యాత్రలో మరో విషాదం చోటు చేసుకుంది. ఆచూకీ గల్లంతైన రెండో మహిళ కొత్త పార్వతి మృతి చెందినట్టు అధికారులు గుర్తించారు. పార్వతి మృతదేహాన్ని స్వస్థలం రాజమండ్రికి తరలించేందుకు ఏపీ సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది.
మంచిర్యాల జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంచిర్యాల జిల్లా కేంద్రంలో గోదావరి ఒడ్డున నిర్మించిన మాత శిశు ఆరోగ్య కేంద్రం చుట్టూ భారీగా వరద నీరు చేరింది. దాంతో గర్భిణీలు ఆస్పత్రి నుంచి పరుగులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది ప్రస్తుతం వారిని ఇతర ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
తెలంగాణ పాలిసెట్ 2022 ఫలితాలను విడుదల చేశారు. పదవ తరగతి పాస్ అయిన వారికి ఇంజనీరింగ్, అగ్రికల్చర్, వెటర్నరీ కోర్సులలో ప్రవేశానికి జూన్ 30న పరీక్ష జరగగా తాజాగా ఫలితాలను విడుదల చేశారు.
భారత్ లో భారీ వర్షాలు కురుస్తుంటే బ్రిటన్ లో మాత్రం ఎండలు మండిపోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దాంతో దేశంలో నేషనల్ హిట్ ఎమర్జెన్సీ విధించాలని అధికారులు భావిస్తున్నారు.