Home » అభిమానుల అత్యుత్సాహం పై ఎన్టీఆర్ సెటైర్ లు… ఏమన్నాడంటే…?

అభిమానుల అత్యుత్సాహం పై ఎన్టీఆర్ సెటైర్ లు… ఏమన్నాడంటే…?

by AJAY
Ad

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ తాజాగా అమిగోస్ అనే సినిమాలో నటించాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దంగా ఉంది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ త్రిబుల్ రోల్ లో నటించాడు. రాజేంద్ర ఈ సినిమా కు దర్శకత్వం వహించాడు. ఇప్పటికే ఈ సినిమా టీజర్ మరియు ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను చాలా గ్రాండ్ గా నిర్వహించారు.

Advertisement

ఆ ఈవెంట్ కు జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిధి గా హాజరయ్యాడు. ఎన్టీఆర్ తన స్పీచ్ లో మాట్లాడుతూ డైరెక్టర్ రాజేంద్ర ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు అని చెప్పారు. ఇంజనీరింగ్ చదివిన రాజేంద్ర సినిమాల కోసం చాలా కష్టపడ్డాడని చెప్పాడు. అంతే కాకుండా దర్శకుడు అయ్యేందుకు చాలా వదులుకున్నాడు అంటూ ఎమోషనల్ అయ్యాడు.

Advertisement

అంతే కాకుండా తన సోదరుడు కళ్యాణ్ రామ్ ప్రయోగాత్మక సినిమా లు చేయడం పై ఎన్టీఆర్ ప్రశంసలు కురిపించారు. నిర్మాత గా నటుడిగా కళ్యాణ్ రామ్ పడుతున్న కష్టం గురించి ఎన్టీఆర్ వివరించాడు. అంతే కాకుండా అభిమానుల అత్యుత్సాహం పై ఎన్టీఆర్ సెటైర్ లు వేశాడు. ఏదైనా సినిమా చేస్తున్నప్పుడు అప్డేట్ ల కోసం పదే పదే అడకూడదు అని అన్నారు.

అలా అడగటం వల్ల దర్శకులు నిర్మాతలు ఒత్తిడికి గురవుతున్నారు అని చెప్పారు. షూటింగ్ ప్రారంభించాక ఎలాంటి అప్డేట్ లు ఉండవని అన్నారు. ఏదైనా ఉంటే ఇంట్లో భార్యల కంటే ముందు మీకే చెబుతాం అంటూ సెటైర్ వేశారు. అది కూడా మంచి అప్డేట్ అయితేనే అంటూ కామెంట్ చేశారు.

Visitors Are Also Reading