Home » సీఎం జగన్ ట్వీట్ పై స్పందించిన జూనియర్ ఎన్టీఆర్ …!

సీఎం జగన్ ట్వీట్ పై స్పందించిన జూనియర్ ఎన్టీఆర్ …!

by AJAY
Ad

ఆర్ఆర్ఆర్ సినిమా పేరు ప్రపంచవ్యాప్తం గా మారుమోగిపోతోంది. ఈ సినిమాలోని నాటు నాటు నాగు సాంగ్ కు గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కడం తో ప్రపంచ వ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ హవా కనిపిస్తోంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీ లో ఈ అవార్డు దక్కింది. ఇక సినిమా మరియు రాజకీయ ప్రముఖులు ఆర్ ఆర్ ఆర్ పై మరియు చిత్రంలో నటించిన నటీ నటులు టెక్నిషియన్స్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Advertisement

Advertisement

కాగా తాజాగా ఏపి సీఎం జగన్ కూడా చిత్ర యూనిట్ ను అభినందిస్తూ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. సీఎం తన ట్వీట్ లో……తెలుగు జెండా పైకి ఎగిరి రెప రెప లాడుతోంది. కీరవాణి, రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ మరియు ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ కు అభినందిస్తున్నాను. మిమ్మల్ని చూస్తే చాలా గర్వంగా ఉంది. అంటూ సీఎం ట్వీట్ లో పేర్కొన్నారు. కాగా ఈ ట్వీట్ కు జూనియర్ రిప్లై ఇచ్చారు.

థాంక్యూ సార్ అంటూ జూనియర్ ఎన్టీఆర్ పేర్కొన్నారు. అయితే ఈ విషయం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఎన్టీఆర్ టిడిపి కి చెందిన వాడు అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవరంలేదు. దాంతో జగన్ ట్వీట్ కు రిప్లై ఇవ్వడం తో అందరూ షాక్ అయ్యాయి మరోవైపు చంద్రబాబు కూడా ఆర్ ఆర్ ఆర్ టీమ్ ను అభినందిస్తూ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ కు ఎన్టీఆర్ థాంక్యూ మామయ్య అంటూ రిప్లై ఇచ్చాడు.

Visitors Are Also Reading