జూనియర్ ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తన తాత తరవాత ఎన్టీఆర్ సినిమాల్లోకి వచ్చారు. ఎన్టీఆర్ బాల నటుడిగా ప్రేక్షకుల ముందుకి వచ్చిన తర్వాత హీరోగా మారారు. తర్వాత ఎంతో మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ని కూడా పొందారు. జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా తో గ్లోబల్ స్టార్ అయి పోయారు. ప్రస్తుతం పూర్తి స్థాయిలో ఆయన సినిమాలు మీదే ఫోకస్ పెట్టారు. ఏపీలో జరుగుతున్న రాజకీయాల లో ఏమాత్రం ఆయన కలగజేసుకోవట్లేదు. అసలు రియాక్ట్ కూడా అవ్వట్లేదు. అందరి వాడిని అనిపించుకునే విధంగా ట్రై చేస్తున్నారు. తనకి రాజకీయాలు ప్రస్తుతానికి వద్దు అని సినిమాలు మీద పూర్తి ఫోకస్ పెడుతున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు రాజకీయాల్లోకి వస్తారని అంతా చూస్తున్నారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం రాజకీయాల్లోకి రావాలని అనుకోవట్లేదు. ఇది ఇలా ఉంటే వేణు స్వామి గురించి ప్రత్యేకించి పరిచయం చేయక్కర్లేదు. సెలబ్రిటీల జాతకాలు చెప్తూ వేణు స్వామి పాపులర్ అయిపోయారు. సమంత నాగచైతన్య విడిపోతారు అన్నప్పటి నుండి కూడా వేణు స్వామి విపరీతంగా పాపులర్ అయిపోయారు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ఇప్పట్లో రారు అని వేణు స్వామి చెప్పారు.
Advertisement
Advertisement
ఎన్టీఆర్ మనసు అంతా పూర్తిగా సినిమాల మీద ఉందని ఆయన చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్ జాతకంలో రాజయోగం ఉందట. 2030 తర్వాత మాత్రమే రాజకీయాల్లోకి ఆయన వస్తారని, అప్పటికి జూనియర్ ఎన్టీఆర్ కి రాజకీయ యోగం మొదలవుతుందని వేణు స్వామి చెప్పారు. అభిమానుల నుంచి ఈ విషయంపై స్పందన కూడా వస్తోంది. నిజానికి జూనియర్ ఎన్టీఆర్ 2024 లో ఎన్నికల్లో టిడిపి తరఫున ప్రచారం చేయాలని అంతా భావిస్తున్నారు కానీ చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు కూడా ఆయన స్పందించలేదు ఎన్టీఆర్ పాలిటిక్స్ లోకి కూడా రావాలని చాలా మంది చూస్తున్నారు మరి ఎన్టీఆర్ ఎప్పుడు రాజకీయాల్లోకి వస్తారు అనేది చూడాలి.
తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!