Telugu News » సీనియర్ ఎన్టీఆర్ ను గుర్తు చేసుకుని జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్….!

సీనియర్ ఎన్టీఆర్ ను గుర్తు చేసుకుని జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్….!

by AJAY MADDIBOINA

నట సార్వభౌముడు, దివంగత ముఖ్యమంత్రి ఎన్టి రామారావు స్వర్గస్థులై నేటికి 26 ఏళ్లు అవుతుంది. 1996 జనవరి 18న నందమూరి తారక రామారావు అనారోగ్యంతో మరణించారు. ఆయన మరణించిన నాటి నుండి ఇప్పటి వరకు ఆయన కుటుంబ సభ్యులు తెలుగు ప్రజలు గుర్తు చేసుకుంటూనే ఉంటారు.

Ads

ఇక నేడు ఆయన వర్ధంతి సందర్భంగా నందమూరి కుటుంబీకులు, ఎన్టీ రామారావు అభిమానులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే తాజాగా ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యారు. సోషల్ మీడియాలో ఎన్టీరామారావు ఫోటోను షేర్ చేసిన ఎన్టీఆర్ “తెలుగు ప్రజల గుండెల్లో నాటికి నేటికి ముమ్మాటికీ ధ్రువ తార మీరే” అంటూ తాతను ఉద్దేశించి పేర్కొన్నారు. ఇక ఎన్టీఆర్ చేసిన ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఎన్టీఆర్ అభిమానులు అన్నగారికి నివాళ్లు అర్పిస్తున్నారు. నందమూరి హీరో కళ్యాణ్ రామ్ కూడా తాజాగా తాత కు నివాల్లు అర్పించారు. అదే విధంగా బాలయ్య ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. ఇక చంద్రబాబు, లోకేష్ లు కరోనా కారణంగా హోమ్ ఐసోలేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే.


You may also like