ఐపీఎల్ 2022 లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్ మాములుగా బంతిని ఉతకడం లేదు. గత ఐపీఎల్ లో అంతగా ఆకట్టుకొని బట్లర్ ఈ ఐపీఎల్ లో మాత్రం చెలరేగిపోతున్నాడు. మొదటి 7 మ్యాచ్ లలో 3 సెంచరీలు చేసిన బట్లర్ ఆ తర్వాత కొద్దిగా పరుగుల వరదను తగ్గించాడు. కానీ నిన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ తో జరిగిన మ్యాచ్ లో మళ్ళీ తన ఫామ్ లోకి తిరిగి వచ్చాడు. 158 పరుగుల టార్గెట్ లోనే ఏకంగా సెంచరీ ఉతికేసాడు. ఈ క్రమంలో బట్లర్ కు పలు రికార్డులు దాసోహం అంటున్నాయి.
Advertisement
అవేంటంటే… నిన్న మ్యాచ్ లో 106 పరుగులు చేసిన బట్లర్ 824 పరుగులు పూర్తి చేసుకున్నాడు. దాంతో ఓ ఐపీఎల్ సీజన్ లో 800 పరుగుల కంటే ఎక్కువ రన్స్ చేసిన మూడో ఆటగాడిగా నిలిచాడు. బట్లర్ కంటే ముందు ఈ మార్క్ ను విరాట్ కోహ్లీ, డేవిడ్ వార్నర్ అందుకున్నారు. అలాగే ఒక్క సీజన్ లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో కూడా మూడో స్థానంలో ఉన్నాడు. ఇందులో 973 పరుగులతో కోహ్లీ మొదటి స్థానంలో ఉంటె 848 పరుగులతో వార్నర్ రెండో స్థానంలో ఉన్నాడు. ఇక నిన్నటి సెంచరీతో ఈ సీజన్ లో 4 సెంచరీలు చేసిన బట్లర్ ఒక్కే సీజన్ లో అత్యధిక సెంచరీలు చేసిన కోహ్లీ రికార్డుతో సమానంగా ఉన్నాడు.
Advertisement
అదే విధంగా ఐపీఎల్ లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్లలో క్రిస్ గేల్ 6 శతకాలతో మొదటి స్థానంలో ఉంటె కోహ్లీ, బట్లర్ 5 సెంచరీలతో రెండో స్థానంలో ఉన్నారు. అలాగే ఒక్కే సీజన్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డ్ లో బట్లర్ 4 వ స్థానానికి వచ్చేసాడు. ఈ లిస్ట్ లో బట్లర్ కంటే ముందు..క్రిస్ గేల్ 59సిక్సులు, ఆండ్రూ రస్సెల్ 52, క్రిస్ గేల్ 51 సిక్సర్లతో మొదటి మూడు స్థానాల్లో ఉన్నారు. అయితే రాజస్థాన్ జట్టు రేపు ఫైనల్స్ గుజరాత్ తో ఆడనుంది. కాబట్టి ఈ మ్యాచ్ లో బట్లర్ ఏ విధంగా రెచ్చిపోతడు.. ఇందులో ఇంకా ఎన్ని రికార్డులు బ్రేక్ చేస్తాడు అనేది చూడాలి.
ఇవి కూడా చదవండి :