Telugu News » పీఆర్‌సీపై రేపే క్లారిటీ..!

పీఆర్‌సీపై రేపే క్లారిటీ..!

by Sravan Sunku
Published: Last Updated on
Ad

పీఆర్సీ నివేదిక విడుదల చేయాలంటూ సచివాలయంలోని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మను కలిసిన ఉద్యోగ సంఘాల నేతలు.. పీఆర్సీ నివేదిక బహిర్గతం చేసే వరకు ఇక్కడి నుంచి కదలబోమంటూ ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే.. సీఎంను కలిసి సీఎస్‌ చర్చించిన తర్వాత నివేదిక విడుదల చేస్తారని భావించినా ఉద్యోగ సంఘాలకు నిరాశ ఎదురైంది.. అయితే, పీఆర్సీ ప్రక్రియ ప్రారభమైందని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు.. మరోవైపు రేపు పీఆర్సీపై స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.. ఎందుకంటే.. రేపు మరోసారి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం కానుంది… ఉద్యోగ సంఘాల ఆందోళనతో మళ్లీ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.. పీఆర్సీ నివేదిక అందజేత, ఫిట్మెంట్, ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ భేటీలో ప్రభుత్వం చర్చించనుంది.

Advertisement

Advertisement

గత నెల 29న పీఆర్సీ నివేదిక ఇస్తామన్న ప్రభుత్వం ఇప్పటికీ ఇవ్వలేదని విమర్శించారు సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, పీఆర్సీ రిపోర్టుపై అధికారులు స్పష్టత ఇవ్వలేదన్న ఆయన.. రిపోర్ట్ ఇవ్వకుండా పీఆర్సీపై మేం మాట్లాడబోమని స్పష్టం చేశారు.. ఉద్యోగ సంఘాల వినతి మేరకే సీఎస్ పీఆర్సీపై సీఎంను కలిశారు.. అధికారులు, ప్రభుత్వంపై కొన్ని ఉద్యోగ సంఘాలు చేస్తున్న విమర్శలు బాధాకరం అన్నారు.. మైలేజ్ కోసం కొన్ని ఉద్యోగ సంఘాలు పోరాటాలు చేస్తున్నాయని మండిపడ్డ ఆయన.. పీఆర్సీపై ఉద్యోగులకు ఒక క్లారిటీ ఉందన్నారు. మిరి పీఆర్సీపై రేపైనా స్పష్టత వస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది.

 

 

Visitors Are Also Reading