జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీలో వారాహి యాత్ర చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే… ఏపీ వాలంటీర్లపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విరుచుకుపడుతున్నాడు. వాలంటీర్ల వల్లే.. ఏపీలో మహిళలు మిస్సింగ్ అవుతున్నారనే వాదనను తెరపైకి తీసుకొస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.
Advertisement
అయితే.. ఈ అంశంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి జోగి రమేష్ కౌంటర్ ఇచ్చారు. వాలంటీర్, సచివాలయ వ్యవస్థలు విజయవంతం కావడం వల్లే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాలంటీర్లపై అనుచిత వాక్యాలు చేస్తున్నారని మంత్రి జోగి రమేష్ ఆరోపించారు. పక్క రాష్ట్రంలో నివసించే పవన్ కు ఏపీతో సంబంధం ఏంటని ప్రశ్నించారు. పవన్ పోటీ చేసే స్థానంలో వాలంటీర్ ను నిలబెట్టి గెలిపించి చూపిస్తామని సవాలు విసిరారు.
Advertisement
జనసేనానికి దమ్ముంటే పోత్తులు లేకుండా బరిలోకి దిగాలని ఛాలెంజ్ చేశారు. పవన్ కళ్యాణ్ కి యాత్రలు చేయడం అలవాటు అని… వారాహి అనే అమ్మవారిని వాహనంగా పెట్టుకోవడం సరికాదని చురకలు అంటించారు. పవన్ కళ్యాణ్ వరాహి యాత్ర కాదు, వారాహి యాత్ర చేస్తున్నాడని గుర్తు పెట్టుకోవాలన్నారు. పవన్ కళ్యాణ్ గతంలో కామన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టారని.. ఇప్పుడు దుష్ట చతుష్టయం ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టారని మండిపడ్డారు. చెప్పు తీసుకొని కొడతా అని బూతులు మాట్లాడిన పవన్ కళ్యాణ్ సంస్కారం గురించి మాట్లాడతారంట అంటూ ఆగ్రహించారు మంత్రి జోగి రమేష్.
ఇవి కూడా చదవండి
Baby Movie Review : బేబీ సినిమా రివ్యూ..రౌడీ హీరో తమ్ముడు హిట్టు కొట్టాడా ?
Sangeetha: పెళ్లి తర్వాత నరకం చూశా.. భర్తను వదిలేద్దామనుకున్నా..!
భార్యకు భర్త.. టైం ఇవ్వకపోతే..భార్య ఇలాంటి పనులే చేస్తుంది !