Home » Tcs Jobs : టీసీఎస్‌లో మ‌హిళ‌ల‌కు ఉద్యోగాలు.. రెండు రోజులే ద‌ర‌ఖాస్తుకు గ‌డువు

Tcs Jobs : టీసీఎస్‌లో మ‌హిళ‌ల‌కు ఉద్యోగాలు.. రెండు రోజులే ద‌ర‌ఖాస్తుకు గ‌డువు

by Anji
Ad

టాటా క‌న్స‌ల్టెన్సీ స‌ర్వీసెస్ కెరీర్ బ్రేక్ తీసుకున్న మ‌హిళ‌ల‌కు మ‌రొక అవ‌కాశం ఇస్తోంది. ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ రంగంలో రెండేండ్ల‌కు పైగా అనుభ‌వం ఉన్న వారిని నియ‌మించుకుంటుంది. టీసీఎస్ టెక్ హైరింగ్ ఫ‌ర్ ఉమెన్ ప్రొఫెష‌న‌ల్స్ పేరుతో రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ నిర్వహిస్తున్న‌ది.

Advertisement

నూత‌నంగా కెరీర్‌ను ప్రారంభించాల‌నుకునే వారు లేదా ప‌లు అనివార్య కార‌ణాల వ‌ల్ల కెరీర్ బ్రేకు తీసుకున్న వారు ఈ ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. టీసీఎస్ బ్యాంకింగ్ ఫైనాన్షియ‌ల్ స‌ర్వీసెస్ అండ్ ఇన్స్యూరెన్స్, టీసీఎస్ క‌మ్యూనికేష‌న్స్, మీడియా అండ్ ఇన్ఫ‌ర్మేష‌న్ స‌ర్వీసెస్‌లో ఉద్యోగ అవ‌కాశాలు ఇస్తోంది. మొత్తం 42 ర‌కాల పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రిస్తోంది. ద‌ర‌ఖాస్తు చేసుకోవడానికి ఏప్రిల్ 23, 2022 చివ‌రి తేదీ కావ‌డం గ‌మ‌నార్హం.

టీసీఎస్ 42 ర‌కాల పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తోంది. ముఖ్యంగా అందులో Net Developer, Net Full Stack, NET/PL SQL, Angular 10+, AWS Developer, Back End Developer, Big Data Developer, DevOps Architect, Google cloud platform, Java Developer, Java Full Stak Developer, Jav Micro Services, Java Scala, Java Spring Boot, Mobile/Smart Device Tester, My SQL DB Administrator, Network Architect, Node JS Developer, PL/SQL, 20 Python, PL/SQL, QA Automation, React JS, Salesforce Developer, Scrum Master, Senior Talend Developer, Service Now Developer, UI Lead, UX Designer.NET+ Angular, Automation Test Engineer, Automation Testing, Automation Testing with Selenium, Core Java Developer, Full Stack Developer, Java Developer, Java Full Stack Developer, VB.NET-Bengaluru/Chennai/Kochi, Visual Basic-CHN/IDR/KOL/HYD.

Advertisement


ఆస‌క్తి గ‌ల మ‌హిళ‌లు https://ibegin.tcs.com/iBegin/register వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. ఐటీ, బీపీఓలో ఏదైనా ఆప్ష‌న్ ఎంచుకోవాల్సి ఉంటుంది. మెయిల్ ఐడీ ఎంట‌ర్‌, పాస్‌వ‌ర్డ్‌, పేరు, ఇత‌ర వివ‌రాలు న‌మోదు చేసి రిజిస్ట్రేష‌న్ చేసుకోవాలి. అదేవిధంగా రెజ్యూమ్ కూడా అప్‌లోడ్ చేసి రిజిస్ట్రేష‌న్ ప్రాసెస్ పూర్తి చేయాలి. సంబంధిత విభాగంలో విద్యార్హ‌త‌ల‌తో పాటు రెండేండ్ల‌కు పైగా అనుభ‌వం ఉన్న వారు మాత్ర‌మే ఈ ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తు చేయాలి. రిజిస్ట్రేష‌న్ ప్రాసెస్ పూర్తి అయిన త‌రువాత టీసీఎస్ నుండి అభ్య‌ర్థుల‌కు స‌మాచారం వ‌స్తుంది. ఇప్ప‌టికే టీసీఎస్ స్మార్ట్ హైరింగ్ 2022, ఎంబీఏ హైరింగ్ 2022, ఆఫ్ క్యాంప‌స్ డిజిట‌ర్ హైరింగ్ 2022, అట్లాస్ హైరింగ్ 2022 ప్రోగ్రామ్స్ ద్వారా ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రిస్తున్న సంగ‌తి తెలిసిన‌దే.

ఇవి కూడా చదవండి :

  1. APPSC JOB Notification: ఏపీలోని నిరుద్యోగుల‌కు అలెర్ట్‌.. ఏపీపీఎస్సీ జాబ్ నోటిఫికేష‌న్ విడుద‌ల
  2. యాంక‌ర్ శ్రీముఖి సినిమాల‌కు గుడ్ బై చెప్ప‌డం వెన‌క ఇంత క‌థ జ‌రిగిందా…!
  3. సచిన్ వారసుడు వస్తున్నాడు…!

Visitors Are Also Reading