కరోనా ఉన్నా దాని అమ్మమ్మ ఉన్నా పెళ్లి మాత్రం గ్రాండ్ గా జరగాలి….వందల మంది బంధువులు రావాలి. భరత్ నాలుగు గంటలు చేయాలి…ఇది చాలా మంది ఆలోచన. కరోనా విజృంభన సమయంలో ప్రజలు తక్కువ మందితో పెళ్లి తంతు కాచిచ్చుకోవాలని చెప్పినా పెడచెవిన పెట్టిన వారు చాలా మంది ఉన్నారు. అలా ఘనంగా పెళ్లిళ్లు చేసి వందల మందికి కరోనా సోకేందుకు కారణం అయ్యారు.
అంతే కాదు అనవసరంగా బంధువులను పిలిపించుకుని కరోనా అంటించుకున్న పెళ్లి కూతురు, పెళ్లి కొడుకులు కూడా ఉన్నారు. అయితే ఓ మంత్రి మాత్రం కరోనా కాస్త తగ్గుముకం పట్టిన ఈ సమయంలో తన కూతురు పెళ్లి సాదాసీదాగా జరిపించాడు. కేవలం కుటుంబ సభ్యుల మధ్యలోనే పెళ్లి తంతును పూర్తి చేశాడు. వివరాల్లోకి వెళితే….రాష్ట గృహనిర్మాణ శాఖ మంత్రి జితేంద్ర అవ్హాడ్ తన కూతురు పెళ్లిని సింపుల్ గా జరిపించాడు.
Advertisement
Advertisement
మంగళవారం జితేంద్ర అవ్హాడ్ తన కూతురు నతాషా అవ్హాడ్ కు రిజిస్టర్ వివాహం జరింపించి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాడు. ఇక ఈ పెళ్లికి ఆయన కుటుంబం తో పాటు వియ్యంకుడి కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. కరోనా నేపథ్యంలోనే ఎలాంటి కేసులు నమోదు అవ్వకుండా తాను ఈ నిర్ణయం తీసుకున్నానని మంత్రి వెల్లడించారు. ఇక మంత్రి తీసుకున్న ఈ నిర్ణయం పై ప్రశంసలు కురుస్తున్నాయి.