Home » రాజశేఖర్ కు నాన్ బెయిలబుల్ వారెంట్…క్లారిటీ ఇచ్చిన జీవిత….!

రాజశేఖర్ కు నాన్ బెయిలబుల్ వారెంట్…క్లారిటీ ఇచ్చిన జీవిత….!

by AJAY
Ad

రాజశేఖర్ గరుడవేగ అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మంచి విజయం సాధించింది. అయితే ఈ సినిమా కోసం జీవితా రాజశేఖర్ లు తమ వద్ద రూ.26 కోట్ల అప్పు తీసుకుని ఎగ్గొట్టారని జోస్టర్ ఫిల్మ్ సర్వీసెస్ యాజమాన్యం సంచలన ఆరోపణలు చేసింది.

Advertisement

అంతే కాకుండా జీవిత రాజశేఖర్ పై నగరి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిందని జోష్టన్ సర్వీసెస్ డైరెక్టర్ కోటేశ్వర్ రాజు తెలిపారు. దాంతో ఈ వార్త టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. కాగా తాజాగా ఈ వార్తలపై జీవిత స్పందించారు. తమపై వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని కొట్టిపారేశారు. శనివారం శేఖర్ సినిమా ప్రెస్ మీట్ ఉందని ఆ ప్రెస్ మీట్ లో అన్ని విషయాలు చెబుతామని అన్నారు. అంతే కాకుండా పూర్తి ఆధారాలను మీడియా ముందు పెడతామని చెప్పారు.

Advertisement

అప్పటి వరకు దీనిపై ఎలాంటి వార్తలు ప్రచారం చేయవద్దని అన్నారు. ఇదిలా ఉండగా శేఖర్ అనే సినిమాలో రాజశేఖర్ హీరోగా నటించారు. ఈ సినిమాకు జీవిత దర్శకత్వం వహించారు. ఈ సినిమా విడుదలకు సిద్దం అవుతున్న నేపథ్యంలో వారిపై ఆరోపణలు రావడం ఆందోళనకు గురి చేస్తోంది. మరి శనివారం ప్రెస్ మీట్ లో జీవిత ఏం చెబుతారో చూడాలి.

Also read : Jersy : హిందీ జెర్సీపై నాని ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్స్‌..!

Visitors Are Also Reading