టాలీవుడ్ స్టార్ నితిన్ సదా హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా జయం. తేజ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమాలోని నటీనటులు ప్రశంసలు అందుకున్నారు. ఈ చిత్రంలో సదా చెల్లెలిగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ కూడా ప్రేక్షకుల మనసు దోచుకుంది. అయితే జయం సినిమాలో సదా చెల్లెలుగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ మరెవరో కాదు, టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న నటి జయలక్ష్మి కూతురు యామిని శ్వేత.
Read also : 17, 18 ఏళ్లకే పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్లు !
Advertisement
అయితే ఈ సినిమా తర్వాత యామిని శ్వేత మరే సినిమాలోను కనిపించలేదు. ఎన్నో అవకాశాలు వచ్చినా కూడా యామిని శ్వేతా సినిమాలకు దూరంగా ఉన్నారు. హీరోయిన్లను తలపించే అందం ఉన్నా కూడా యామిని శ్వేత సినిమాలకు ఎందుకు దూరంగా ఉన్నారు. అవకాశాలు వచ్చిన ఎందుకు నో చెప్పారు అన్న సంగతి ఇప్పుడు చూద్దాం, ఓ ఇంటర్వ్యూలో యామిని శ్వేత తల్లి విజయలక్ష్మి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Advertisement
సినిమా ఇండస్ట్రీలో తన జీవితాన్ని నిలబెట్టుకోవడానికి చాలా బాధలు పడాల్సి వచ్చిందని జయలక్ష్మి అన్నారు. ఆ బాధలు తన కూతురు పడకూడదని అన్నారు. తన కూతురిని బాలనాటిగా చూడాలని ఆశ ఉండేదని ఆ కోరిక తీరిందని చెప్పారు. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలో చాలా అవకాశాలు వచ్చాయి కానీ తను ఓకే చెప్పలేదని అన్నారు. ప్రస్తుతం తన కూతురు పెళ్లి చేసుకుని అమెరికాలో సంతోషంగా ఉందని చెప్పారు. కాగా యామిని శ్వేత ప్రస్తుతం అమెరికాలో స్థిరపడ్డారు.
READ ALSO : పవన్ కళ్యాణ్ వాహనానికి “వారాహి” పేరు ఎందుకు పెట్టారు.. అసలు దాని వెనుక ఉన్న రహస్యం ఏంటీ ?