Home » Japan Teaser: ‘జపాన్’.. మేడ్ ఇన్ ఇండియా.. కార్తి ఎంట్రీ అదుర్స్

Japan Teaser: ‘జపాన్’.. మేడ్ ఇన్ ఇండియా.. కార్తి ఎంట్రీ అదుర్స్

by Bunty
Ad

తమిళ్ స్టార్ హీరో కార్తీ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఖైదీ, నా పేరు శివ, లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు కార్తీ. డిఫరెంట్ కథాంశాలతో సినిమాలు తీసే కార్తి… తాజాగా మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమానే జపాన్. ఈ మూవీ ఇంట్రడక్షన్ వీడియోను ఇవాళ చిత్త బృందం రిలీజ్ చేసింది. తెలుగు వర్షన్ ను మన తెలుగు స్టార్ హీరో విజయ్ దేవరకొండ రిలీజ్ చేశారు.

Advertisement

మీరు అనుకున్నట్లు కాదు… వాడు దూల తీర్చే విలన్ అంటూ టైటిల్ రోల్ గురించి సునీల్ చెబుతున్న డైలాగ్స్ తో ఎంట్రీ ఇచ్చాడు హీరో కార్తీ. ఇక ఈ వీడియో చూశాక జపాన్ మూవీపై అంచనాలు భారీగా పెరిగాయి. కార్తీ మరో సూపర్ హిట్ కొట్టబోతున్నట్లు మనకు ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. అలాగే కార్తీ గెటప్స్ కూడా అదిరిపోయాయి.

Advertisement

జీవి ప్రకాష్ కుమార్ బిజిఎం సినిమాకు చాలా ప్లస్ అవుతుంది.  కాగా ఈ సినిమాలో అను ఇమాన్యూయల్ హీరోయిన్గా నటిస్తోంది. అలాగే జపాన్ సినిమాలో సునీల్ మరియు విజయ్ మిల్టన్ ఇద్దరు కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాను డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ప్రభు నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే దీపావళి సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లు వీడియో ద్వారా తెలిపారు. ఇక ఈ సినిమా అవుతుందో చూడాలి.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

IPL 2023 : ముంబైని గెలిపించిన ఆకాశ్ మద్వాల్ కు పంత్ కు ఉన్న సంబంధం ఏంటో తెలుసా?

Sudhakar : నేను ఇంకా చనిపోలేదు… బతికే ఉన్నాను

Gangavva : చంద్రబాబుకు గంగవ్వ క్షమాపణలు… తప్పుగా అనుకోవద్దు సార్…

 

Visitors Are Also Reading