Manam News : బ్రేకింగ్ న్యూస్ తెలుగు » ఆ బాలీవుడ్ హీరోకి ఇల్లు అమ్మిన జాన్వీక‌పూర్‌.. ఎన్ని కోట్ల లాభం వ‌చ్చిందంటే..?

ఆ బాలీవుడ్ హీరోకి ఇల్లు అమ్మిన జాన్వీక‌పూర్‌.. ఎన్ని కోట్ల లాభం వ‌చ్చిందంటే..?

by Anji

సినీ న‌టులు ఈ మ‌ధ్య కొత్త ఇల్లులు కొనుగోలు చేయ‌డం అమ్మ‌డం కామ‌న్ అయిపోయింది. నాగ‌చైత‌న్య‌, స‌మంత క‌లిసి ఉన్న ఇంటిని స‌మంత ఇదివ‌ర‌కు అమ్మేసి మ‌ర‌ల తిరిగి అదే ఇల్లును కొనుగోలు చేసిందట‌. ఇదిలా ఉండ‌గా బాలీవుడ్ లో అత్యంత ప్ర‌తిభ వంతులైన న‌టుల‌లో రాజ్ కుమార్ రావు ఒక‌ర‌ని చెప్ప‌వ‌చ్చు. ఆయ‌న ఇటీవ‌లే ముంబైలో విలాస‌వంత‌మైన ట్రిప్లెక్స్ అపార్ట్‌మెంట్‌ భ‌వ‌నాన్ని కొనుగోలు చేశార‌ట‌.


ఈ అపార్ట్‌మెంట్ ముంబైలోని జుహులో ఉంది. రాజ్ కుమార్ ఈ అపార్ట్ మెంట్ న‌టి జాన్వీక‌పూర్ నుంచి కొనుగోలు చేయ‌డం విశేషం. ఈ అపార్ట్ మెంట్ కోసం రూ.44 కోట్లకు కొనుగోలు చేశార‌ట‌. రాజ్‌కుమార్, జాన్వీ క‌లిసి రూహి చిత్రంలో ప‌ని చేశారు. సినిమాలో ఇద్ద‌రి మ‌ధ్య అద్భుత‌మైన కెమెస్ట్రీ క‌నిపించింది. ఇక ఈ ఇంటిపి అమ్మ‌డం ద్వారా జాన్వీక‌పూర్ కూడా బాగా లాభ‌ప‌డింది. రెండు సంవ‌త్స‌రాల క్రితం జాహ్న‌వి క‌పూర్ ఈ ఇంటిని కొనుగోలు చేసింది. జాన్వీ 2020 డిసెంబర్ లో 39 కోట్ల రూపాయ‌ల‌కు కొనుగోలు చేసింది.

Ad


ఈ డీల్ ద్వారా జాన్వీకి రూ.5కోట్ల లాభం వ‌చ్చింది. ఈ అపార్ట్‌మెంట్ 3456 చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో ఉంది. దీని చ‌ద‌ర‌పు అడుగు ధ‌ర రూ.1.27 లక్ష‌లు. దేశంలోనే అత్యంత ఖ‌రీదైన డీల్స్ లో ఇది ఒక‌టి. ఇక ఈ అపార్ట్‌మెంట్ భ‌వ‌నాన్ని బాలీవుడ్ ప్ర‌ముఖ నిర్మాత‌, బిల్డ‌ర్ ఆనంద్ పండిట్ నిర్మించారు. ఈ భ‌వనాన్ని లోట‌స్ ఆర్య అని పిలుస్తుంటారు. రాజ్ కుమార్ రావు త‌న భార్య పత్ర‌ లేఖ‌తో క‌లిసి ఈ అపార్ట్‌మెంట్ ని కొనుగోలు చేశారు. ఇక ఈ అపార్ట్‌మెంట్ 14, 15, 16 అంత‌స్తు వ‌ర‌కు ఉంటుంది. ఈ భ‌వ‌నంలో రాజ్‌కుమార్, ప‌త్ర‌లేఖ గ‌తంలో ఇదే భ‌వ‌నంలోని 11, 12 అంత‌స్తుల్లో అపార్ట్‌మెంట్లు కొనుగోలు చేశారు.

Also Read : 

బాహుబ‌లి సినిమాలో న‌టించే ఛాన్స్ ను మిస్ చేసుకున్న 6 గురు స్టార్స్ వీళ్లే..!

పెళ్లి తరవాత ప్రేమ తగ్గిపోతుందా…? ఈ టిప్స్ తో మళ్ళీ ప్రేమని పెంచుకోండి…!

 

Visitors Are Also Reading