Home » TOP 10 NEWS : ముఖ్య‌మైన వార్తాంశాలు…!

TOP 10 NEWS : ముఖ్య‌మైన వార్తాంశాలు…!

by AJAY
Ad
INDIA CORONA UPDATE

INDIA CORONA UPDATE

నిన్న‌టి వ‌ర‌కూ దేశంలో 3 ల‌క్ష‌ల‌కు పైగా కేసులు న‌మోదుకాగా తాజాగా నేడు కేసుల సంఖ్య‌లో త‌గ్గుముఖం క‌నిపిస్తోంది. భార‌త్‌లో గ‌డిచిన 24గంటల్లో కొత్త‌గా 2,55,874 క‌రోనా కేసులు నమోద‌య్యాయి. 614 మంది క‌రోనాతో మ‌ర‌ణించారు.

నేడు సీఎం జ‌గ‌న్ వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం ప‌థకాన్ని ప్రారంభించ‌నున్నారు. వ‌ర్చువ‌ల్‌గా ప‌థ‌కాన్ని ప్రారంభించ‌నున్నారు. 45 నుండి 60 ఏళ్ల‌లోపు అగ్ర‌వ‌ర్ణ పేద మ‌హిళ‌ల‌కు ఆర్థికసాయం చేసేందుకు ఈ ప‌థ‌కాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ ప‌థ‌కం ద్వారా నేడు 3.92 ల‌క్ష‌ల ఖాతాల్లో రూ.589 కోట్లు జ‌మచేయ‌నున్నారు.

Advertisement

2017 న పొర‌పాటున పాక్ భూభాగంలోకి ప్ర‌వేశించిన 20 మంది జాల‌ర్లను ఎట్ట‌కేల‌కు పాక్ విడుద‌ల చేసింది. నాలుగేళ్ల‌పాటు క‌రాచీలోని లాంధీ జైలులో జాల‌ర్లకు శిక్ష‌వేసింది.

 

టీడీపీ అధినేత చంద్రబాబు క‌రోనాను జ‌యించారు. ఈనెల 18న చంద్రబాబుకు కరోనా నిర్ధారణ అయ్యింది. కాగా హోం ఐసోలేషన్‌లో ఉంటూ చంద్రబాబు క‌రోనా నుండి కోలుకున్నారు.

Advertisement

corona omricon

corona omricon

తెలంగాణ‌లో క‌రోనా ప‌రిస్థితుల‌పై నేడు హైకోర్టులో విచార‌ణ జ‌ర‌గ‌నుంది. ఆర్టీపీసీఆర్ టెస్టులు రోజుకు ల‌క్ష పెంచాల‌ని హైకోర్టు గ‌తంలో ఆదేశాలు జారీ చేసింది. దానికి సంబంధించిన ఆర్టీపీసీఆర్‌, ర్యాపిడ్ టెస్టుల వివ‌రాలు ప్ర‌భుత్వం హైకోర్టుకు స‌మ‌ర్పించ‌నుంది.

తెలంగాణ‌లో ఈనెల 30న సెల‌వులు ముగుస్తుండ‌టంతో స్కూల్ల రీఓపెన్ పై ర‌క‌ర‌కాల వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఇంకా స్కూల్ల రిఓపెన్ పై ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేద‌ని స్ప‌ష్టం చేశారు.

క‌రోనా కేస‌లు పెరుగుత‌న్న నేప‌థ్యంలో ఏపీ ప్ర‌భుత్వం ఉద‌యం ప్రార్థ‌న‌లు నిర్వ‌హించ‌వ‌ద్ద‌ని కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

ఏపీ కి చెందిన ఓ అంధుడైన శ్రీకాంత్ బొల్లా అనే యువ‌కుడు బొల్లాస్ ఇండ‌స్ట్రీస్ ను స్థాపించి ఏకంగా 480 కోట్ల‌కు అధిప‌తి అయ్యాడు.

మ‌హ‌రాష్ట్ర‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రింగింది. ఈ ప్ర‌మాదంలో ఏకంగా ఏడుగురు విద్యార్థులు మ‌ర‌ణించారు. వారిలో తిరోడా ఎమ్మెల్యే విజయ్ కుమారుడు కూడా ఉన్నారు.

వైఎస్ఆర్టీపీ క‌మిటీల‌న్ని ర‌ద్దు చేస్తూ అధ్య‌క్షులు ష‌ర్మిల సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. కేవ‌లం జిల్లాల‌కు మాత్ర‌మే కోర్డినేట‌ర్ ల‌ను నియ‌మిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు.

Visitors Are Also Reading