టాలీవుడ్ లో ఎప్పటికి గుర్తుంది పోయే హీరోయిసం లలో శ్రీదేవి మొదటి స్థానంలో ఉంటుంది అనేది తెలిసిందే. తన సమయంలో హీరోలకు సమానంగా పాపులారిటీ అనేది సంపాదించుకుంది శ్రీదేవి. ఆ తర్వాత బాలీవుడ్ కు వెళ్లిపోయిన శ్రీదేవి యొక్క కూతురు జాన్వీ కపూర్ ప్రస్తుతం హీరోయిన్ గా హిందీలో రాణిస్తుంది. కానీ ఆమెను తెలుగులోకి తీసుకురావాలి అని చాల మంది ప్రయత్నించారు.
Advertisement
మొదట విజయ్ దేవరకొండ సినిమాతో జాన్వీ కపూర్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుంది అన్నారు. కానీ అది జరగలేదు. ఆ తర్వాత ఎన్టీఆర్ కొత్తగా నటిస్తున్న కొరటాల శివ సినిమాలో హీరోయిన్ జాన్వీ కపూర్ అనే ప్రచారం జోరుగా సాగింది. కానీ ఆమెకు డేట్స్ అనేవి కుదరకపోవడంతో ఈ సినిమాలో జాన్వీ కపూర్ చేయడం లేదు అన్నారు. కానీ ప్రస్తుతం ఎన్టీఆర్, కొరటాల శివ సినిమా అనేది అనుకున్న దానికంటే ఎక్కువగా వాయిదా పడింది.
Advertisement
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ సినిమా షూటింగ్ అనేది ఉంది. ఇక ఈ గ్యాప్ లో ఎన్టీఆర్ కు హీరోయిన్ కోసం చిత్రబృందం అనేది బాగానే వెతికింది. కానీ ఇప్పటివరకు ఫిక్స్ కాలేదు. అయితే ఈ గ్యాప్ లో మళ్ళీ జాన్వీ కపూర్ నే వీరు సంప్రదించారు అని తెలుస్తుంది. అయితే జాన్వీ కపూర్ ఈ సినిమాలో చేయడానికి ఒప్పుకుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి :