Home » ఆర్ఆర్ఆర్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో క‌ల‌క‌లం..వీడియోలు వైర‌ల్…!

ఆర్ఆర్ఆర్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో క‌ల‌క‌లం..వీడియోలు వైర‌ల్…!

by AJAY
Ad

రామ్ చ‌ర‌ణ్ ఎన్టీఆర్ హీరోలుగా న‌టించిన సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమాకు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. డివివి దాన‌య్య ఈ చిత్రాన్ని నిర్మించారు. భారీ బ‌డ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాలో హీరోయిన్ లుగా అలియా భ‌ట్ ఒలివియా మోరిస్ లు హీరోయిన్ లుగా న‌టించారు. అంతే కాకుండా అజ‌య్ దేవ్ గ‌న్, శ్రియ‌ కూడా సినిమాలో ముఖ్య‌మైన పాత్ర‌ల్లో న‌టించారు. ఇక ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ క‌ర్నాట‌క ఏపీ స‌రిహ‌ద్దుల్లోని చిక్క‌బ‌ళ్లాపూర్ స‌రిహ‌ద్దుల్లో జ‌రిగింది.

Advertisement

Advertisement

అయితే ఈవెంట్ లో కొంత‌మంది అభిమానులు క‌ల‌క‌లం సృష్టించారు. ఈవెంట్ లో ఏర్పాటు చేసిన ఓ ట‌వ‌ర్ పైకి ఎక్కి జ‌న‌సేన జండాల‌ను ప‌ట్టుకున్నారు. మ‌రికొంద‌రు ఎన్టీఆర్ అభిమానులు టీడీజీ జండాల‌ను ఎగ‌ర‌వేశారు. దాంతో అక్క‌డ ఉద్రిక్త‌త వాతావ‌ర‌ణం నెల‌కొంది. ట‌వ‌ర్ పై నుండి దిగాల‌ని నిర్వాహ‌కులు హెచ్చ‌రించిన‌ప్ప‌టికీ అభిమానులు మాత్రం దిగ‌కుండా అలాగే ఉండిపోయారు. ఇక ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.

Visitors Are Also Reading