“చరిత్రలో మనం ఉండటం కాదు మనమే ఒక చరిత్ర కావాలి”. సినిమా నటుల గురించి చెప్పేటప్పుడు ఇలాంటి బరువైన పదాలు అవసరం లేదు. కానీ మనం చెప్పుకోబోయేది పవన్ కళ్యాణ్ గురించి కదా. ఆ మాత్రం ఉండాల్సిందే. అసలు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటేనే ఓ ప్రభంజనం. పవన్ కళ్యాణ్ అంటేనే, ఓ ప్రభంజనం. పవన్ కళ్యాణ్ అంటేనే మనకు ఒక ఎమోషన్. చాలామంది హీరోలు ఉన్న ఆయనే ఎంతోమందికి ఫేవరేట్ హీరోగా ఉంటాడు.
Advertisement
యూత్ నుంచి కాస్త వయసు పెద్దవాళ్ళు కూడా ఆయన్ని అభిమానించకుండా ఉండలేరు. అందుకే ఆయనకు ఫ్యాన్స్ కాదు భక్తులు ఉంటారు. రాజకీయాలతో పవన్ కళ్యాణ్ ఎంత బిజీగా ఉన్నా సినిమాలు మాత్రమే ఆయన్ని అందరికీ హీరోను చేశాయి. అందుకే అన్నయ్య చిరంజీవి చేసిన తప్పు చేయకుండా పవన్ సినిమాలను, రాజకీయాలను ఎంతో బ్యాలన్స్ చేస్తూ ముందుకు దూసుకుపోతున్నాడు.
Advertisement
తాజాగా ఓ పెళ్లి జంట కూడా పవన్ కళ్యాణ్ పై, ఆయన పెట్టిన జనసేన పార్టీపై తమకున్న అభిమానాన్ని వినూత్నంగా చాటుకుంది. తెలుగు రాష్ట్రాల్లో పెళ్లికి చాలా తతంగం ఉంటుంది. పంతులు చెప్పిన విధంగా చేస్తూ ఇద్దరూ ఒక్కటవుతారు. మెడలో పూలదండలు వేసుకొని అందంగా తయారవుతారు. అయితే ఏపీలో ఓ పెళ్లి జంట మాత్రం వినూత్నంగా ఒక్కటయింది. పెళ్లి సమయంలో జనసేన పార్టీ కండువాను మెడలో వేసుకొని, ఆ జంట ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు పవన్ ఫ్యాన్స్ దీన్ని సపోర్ట్ చేస్తుంటే, మరికొందరు మాత్రం ఏంటి ఈ పిచ్చి పని అని కామెంట్స్ పెడుతున్నారు.
READ ALSO : “లవ్ యు రాజా” అనే పదం పోసానికి ఎందుకు మేనరిజంగా మారింది?