ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడు రసవత్తరంగానే ఉంటాయి. అక్కడ ఎన్నికలు ఉన్నా లేకున్నా రాజకీయాలు మాత్రం చాలా వాడి వేడిగా ఉంటాయి. ఏపీలో తరుచుగా వినిపిస్తున్న పొత్తులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజాగా మాట్లాడారు. గతంలో వన్ సైడ్ లవ్ అనే కామెంట్లు చేసిన చంద్రబాబు.. ప్రస్తుతం వార్ వన్ సైడ్ అంటున్నారు. చంద్రబాబుకు ఓ క్లారిటీ వచ్చిన తరువాత పొత్తులకు సంబంధించి మిగిలిన విషయాలు మాట్లాడుతాం. రాష్ట్రం కోసం నేను తగ్గడానికైనా సిద్ధం. చాలా సార్లు తగ్గాను.. కానీ ఈ సారి మాత్రం మిగిలిన వాళ్లు తగ్గితే బాగుంటుందని ఆశిస్తున్నట్టు చెప్పారు పవన్ కల్యాణ్.
ముఖ్యంగా టీడీపీ కొంత మేరకు తగ్గితే బాగుంటుందని పవన్ సూచించారు. బీజేపీతో సంబంధాలు బాగున్నాయని పవన్ స్పష్టం చేశారు. పొత్తుల విషయంలో మూడు ఆప్షన్లపై చర్చిద్దామని జనసేన నేతలకు సూచించారు. ఇటీవలే బీజేపీ జాతీయ స్థాయి నేతలతో చర్చలు కొనసాగాయి. బీజేపీ-జనసేనకు మంచి సంబంధాలే ఉన్నాయి. కానీ కరోనా మహమ్మారి కారణంగా ఉమ్మడి కార్యక్రమాలు చేపట్టలేకపోయాం. త్వరలోనే జనసేన బీజేపీ మధ్య సోషల్ డిస్టెన్స్ తగ్గుతుంది అన్నారు పవన్.
Advertisement
Advertisement
ప్రస్తుతం మన ముందు మూడు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. వాటిలో 1. జనసేన-బీజేపీ ప్రభుత్వం స్థాపించడం. 2. జనసేన-టీడీపీ-బీజేపీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం. 3. జనసేన ఒంటరిగా ప్రభుత్వాన్ని స్థాపించడం. ఈ మూడు ప్రత్యామ్నాయాలపై త్వరలోనే చర్చిద్దామని చెప్పారు పవన్. ఇక మంచి కోసం తగ్గాలనేది బైబిల్ సూక్తి. టీడీపీ ఆ బైబిల్ సూక్తి పాటిస్తే మంచిది అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
Also Read :
మెగా అభిమానులకు శుభవార్త.. త్రివిక్రమ్‌తో ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్..?
చరణ్, చైతన్య, రామ్ సినిమాలతో చాలా నష్టపోయా.. ఆ డిస్ట్రిబ్యూటర్ సంచలన వ్యాఖ్యలు..!