Manam News : బ్రేకింగ్ న్యూస్ తెలుగు » ఆగిన జనగణమణ షూటింగ్.. కారణమేంటంటే..?

ఆగిన జనగణమణ షూటింగ్.. కారణమేంటంటే..?

by Azhar
Ads

టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రస్తుతం కష్టాల్లో ఉన్నాడు అనే చెప్పాలి. అయితే ఈ మధ్యే పూరి జగన్నాథ్ అలాగే హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో లైగర్ అనే సినిమా వచ్చిన విషయం తెలిసిందే. విజయ్ దేవరకొండ కెరియర్ లో మొదటి పాన్ ఇండియా సినిమా అయిన ఈ లైగర్ భారీ డిజాస్టర్ అయ్యినట్లు తెలుస్తుంది. అయితే ఈ సినిమ ఎఫెక్ట్ అనేది వీరి తర్వాత సినిమాపైన పడినట్లు తెలుస్తుంది.

Advertisement

Ad

అయితే విజయ్ దేవరకొండ తన తర్వాతి సినిమా కూడా డైరెక్టర్ పూరి జగన్నాథ్ తోనే తీస్తున్నాడు. ఆ సినిమా పేరు జన గణ మన. అయితే ఈ సినిమా అనేది పూరి జగన్నాథ్ యొక్క డ్రీమ్ ప్రాజెక్ట్ అనే విషయం అందరికి తెలిసిందే. దీని పైన పూరితో పాటుగా ఫ్యాన్స్ కు కూడా భారీ ఆశలే ఉన్నాయి. అయితే ఈ సినిమా యొక్క మొదటి షెడ్యూల్ అనేది ఈ లైగర్ సినిమా విడుదలకు ముందే అయ్యిపోయింది.

Advertisement

కానీ ఇపుడు తా సమాచారం ప్రకారం జన గణ మన సినిమా షూటింగ్ అనేది ఆగిపోయినట్లు తెలుస్తుంది. అందుకు కారణం పూరి జగన్నాథ్ అని సమాచారం. తాజాగా లైగర్ ఇచ్చిన రిజల్ట్ తో పూరి జగన్నాథ్ చాల డిప్రెషన్ లోకి వెళ్లినట్లు తెలుస్తుంది. అందుకే జన గణ మన సినిమా యొక్క సెకండ్ షెడ్యూల్ అనేది ఇప్పటికే ప్రారంభం కావాల్సిన పూరి జగన్నాథ్ దానిని వాయిదా వేసినట్లు తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి :

బాబర్ ఇక కంఫర్ట్ జోన్ నుండి బయటకు రావాలి..!

పాకిస్థాన్ నోరు మూయించిన ఇర్పాన్ పఠాన్..!

Visitors Are Also Reading