Home » Jan 8th 2023 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

Jan 8th 2023 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad

నేడు చంద్రబాబు తో పవన్ కల్యాణ్ భేటీ కానున్నారు. కుప్పం ఘటనపై చంద్రబాబును పవన్ పరామర్శించనున్నారు. విశాఖ ఘటనపై గతంలో పవన్‌ను బాబు పరామర్శించారు.

Advertisement

జమ్ముకశ్మీర్ బాలాకోట్‌లో ఎన్‌కౌంటర్ జరిగింది. ఉగ్రవాదులకు, భద్రతాబలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరగ్గా ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదుల హతం అయ్యారు.

నైజీరియా, ఇండోనేషియా, చైనా కేంద్రంగా లోన్‌యాప్‌లు పనిచేస్తున్నాయి. రూ. 3వేల రుణానికి రూ.18వేలు కట్టాలని లోన్ యాప్ నిర్వాహకులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. లోన్ తీర్చకుంటే అశ్లీల వైబ్‌సైట్‌లో ఫోటోలు పెడతామని బెదిరింపులకు పాల్పడుతున్నారు. తిరుపూర్‌లో ఓ మహిళ ఫిర్యాదుతో లోన్ యాప్ వ్యవహారం బయటకు వచ్చింది.

తమిళనాడులో బరితెగించిన లోన్‌యాప్ నిర్వాహకులు.. ఒక నంబర్‌ను 200 సిమ్‌కార్డులకు లింక్ చేసి బెదిరింపులు.. సొంతంగా టెలిఫోన్ ఎక్స్‌ఛేంజీ నిర్వహిస్తున్న లోన్‌యాప్ నిర్వాహకులు.. ఎవరూ గుర్తించకుండా వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్ వాడుతున్న సిబ్బంది.

Advertisement

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,300 గా ఉండగా….. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,960 గా ఉంది.

తెలుగు రాష్ట్రాలపై చలి పంజా విసురుతోంది. కొమురంభీం జిల్లాలో 4.7, మంచిర్యాల జిల్లాలో 7.4, ఆదిలాబాద్ జిల్లాలో 7.6, నిర్మల్ జిల్లాలో 8.9, మెదక్ జిల్లా శివ్వంపేటలో 9.8, సంగారెడ్డి: కోహిర్‌లో 7.8, నల్లవల్లిలో 8.2, న్యాల్కల్‌లో 8.9 డిగ్రీలకు పడిపోయాయి.

నేడు వాల్తేరు వీరయ్య ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరగనుంది. శరవేగంగా ప్రీ-రిలీజ్ ఈవెంట్ స్టేజ్ పనులు జరుగుతున్నాయి. నిన్న రాత్రి ఆర్కే బీచ్ నుంచి ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్‌కు తరలింకానున్నారు.

రాజ్‌కోట్ టీ20లో టీమిండియా ఘనవిజయం సాధించింది. శ్రీలంకపై 91 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది.

Visitors Are Also Reading