Home » Jan 5th 2023 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

Jan 5th 2023 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad

నిన్న తిరుమ‌ల‌ శ్రీవారిని 61,116 మంది భక్తులు ద‌ర్శించుకున్నారు. 18,004 మంది భక్తులు త‌ల‌నీలాలు స‌మ‌ర్పించారు. హుండీ ఆదాయం రూ. 4.19 కోట్లు వ‌చ్చింది.

Advertisement

ఢిల్లీలో నేటి నుంచి 3 రోజుల పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల జాతీయ సదస్సు జ‌ర‌గ‌నుంది. ఈ స‌ద‌స్సుకు ప్రధాని నరేంద్ర మోడీ హాజ‌ర‌వుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య భాగస్వామ్యాన్ని మరింత పెంచే లక్ష్యంతో సదస్సు నిర్వ‌హిస్తున్నారు.

నేడు భారత్‌-శ్రీలంక మధ్య రెండో టీ20 మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. రాత్రి 7 గంటలకు పుణె వేదికగా ప్రారంభం కానున్న మ్యాచ్‌.. మూడు టీ20ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో భారత్ నిలిచింది.


నేడు విశాఖ జిల్లాలో సీఎం జగన్ పర్యటిస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు యలమంచిలిలోని అడారి ఆనంద్ నివాసానికి సీఎం జగన్ చేరుకుంటారు. విశాఖ డెయిరీ ఛైర్మన్ అడారి తులసీ రావుకు సీఎం జగన్ నివాళ్లర్పించనున్నారు.

Advertisement

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. టీ కాంగ్రెస్ ఇంఛార్జి పదవికి మాణిక్కం ఠాగూర్ రాజీనామా చేశారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంఛార్జిగా మాణిక్‌రావు థాక్రే ను నియమించారు.

కర్నూలు నల్లమల అటవీప్రాంతంలో పెద్దపులుల కలకలం రేగింది. బైర్లూటి జంగిల్ క్యాంప్‌లో రెండు పులులు క‌నిపించాయి. సందర్శకులకు ఒకేసారి రెండు పెద్దపులులు క‌నిపించ‌డంతో భయాందోళనకు గుర‌వుతున్నారు.

ఏపీ మాజీ హోం మంత్రి సుచ‌రిత వైసీపీకి గుడ్ బై చెప్పే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది. తాజాగా సుచ‌రిత త‌న భ‌ర్త పార్టీ మారితే తాను కూడా మార‌తాన‌ని వ్యాఖ్యానించారు. భ‌ర్త అడుగుజాడ‌ల్లో న‌డుస్తాన‌ని..తామంతా వైసీపీ కుటుంబ స‌భ్యుల‌మ‌ని వ్యాఖ్యానించారు.

కేంద్ర‌హోం మంత్రి అమిత్ షా ప్ర‌యాణిస్తున్న విమానం ఎమ‌ర్జ‌న్సీగా ల్యాండింగ్ అయ్యింది. అగ‌ర్త‌ల వెళుతుండగా ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ప్ర‌తికూల వాతావ‌ర‌ణం కార‌ణంగా గౌహ‌తిలో ల్యాండ్ చేశారు.

ఏపీ సీఎం జ‌గన్ కు ప‌వ‌న్ భ‌హిరంగ లేఖ రాశారు. ర్యాలీలు, స‌భ‌ల పై నిశేదం విధించ‌డం పై ప‌వ‌న్ మండిప‌డ్డారు.

Visitors Are Also Reading