Home » Jan 3rd 2023 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

Jan 3rd 2023 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad

హైదరాబాద్‌ మెట్రో ఉద్యోగులు నేడు సమ్మెకు దిగారు. జీతాలు పెంచాలని మెట్రో ఉద్యోగుల సమ్మె చేస్తున్నారు.

దుబ్బాక బీజేపీలో ముసలం.. ఎమ్మెల్యే రఘునందన్‌రావుకు వ్యతిరేకంగా సీనియర్ల తిరుగుబాటు షురూ అయ్యింది. రహస్య ప్రాంతంలో బీజేపీ సీనియర్‌ నేతల సమావేశాలు… ఎమ్మెల్యే బీఆర్ఎస్‌ కోవర్టుగా పనిచేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. తమకు పార్టీలో తగిన గౌరవం ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

నేడు రాజమండ్రిలో సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటిస్తున్నారు. వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక పెంపు లబ్ధిదారులతో సీఎం జగన్‌ ముఖాముఖి సమావేశం కానున్నారు.

ఏపీలో రోడ్లపై బహిరంగ సభలు, ర్యాలీలపై నిషేధం విధించారు. గుంటూరు, కందుకూరు ఘటనలతో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జాతీయ, రాష్ట్ర, మున్సిపల్‌, పంచాయతీరాజ్‌ రోడ్లపై సభలు, ర్యాలీలు నిషేధంవిధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

Advertisement

వైకుంఠ ఏకాదశి రోజు శ్రీవారి హుండీ ఆదాయం కొత్త రికార్డు సృష్టించింది. రూ.7.68 కోట్లను భక్తులు హుండీలో సమర్పించారు.

నేడు భారత్‌-శ్రీలంక మధ్య తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ముంబై వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

బీఆర్ఎస్ పార్టీలో చేరిన ఏపీ నేతలకు సీఎం కేసీఆర్ స్వాగతం పలికారు. భారత్ లో అత్యద్భుత వ్యవసాయ అనుకూల వాతావరణం ఉందని 70 వేల టీఎంసీల నీరు అందుబాటులో ఉందని ఆయన వెల్లడించారు.

రేపటి నుండి మూడు రోజుల పాటు టిడిపి అధినేత చంద్రబాబు కుప్పం లో పర్యటించనున్నారు. అయితే ఈ పర్యటనకు పోలీసులు అనుమతి ఇస్తారా లేదా అన్నది హాట్ టాపిక్ గా మారింది.

తెలంగాణ లో త్వరలో ఉద్యోగుల బదిలీలు మరియు పదోన్నతులు చేపట్ట నున్నట్టు సీఎస్ సోమేష్ కుమార్ వెల్లడించారు.

టూరిజం ను డెవలప్ చేయడానికి దుబాయ్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం పై 30 శాతం టాక్స్ ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.

Visitors Are Also Reading