Home » Jan 30th 2023 Top News : నేటి ముఖ్యమైన వార్తలు..!

Jan 30th 2023 Top News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad

కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వ్యవహారంపై పార్టీ హైకమాండ్ దృష్టి పెడుతోంది. జరుగుతున్న పరిణామాలపై మంత్రి కాకాణి ఆరా తీశారు. వినుకొండ పర్యటనలో జగన్‌ దృష్టికి కోటంరెడ్డి వ్యవహారం వెళ్ళింది.

Advertisement

కాసేపట్లో పల్నాడు జిల్లా వినుకొండకు సీఎం జగన్‌ పయనం అవుతున్నారు. జగనన్న చేదోడు పథకం మూడో విడత సాయం అందజేస్తున్నారు. దర్జీలు, రజకులు, నాయీబ్రాహ్మణులకు రూ.10 వేల సాయం ఇవ్వనున్నారు. లబ్ధిదారుల ఖాతాల్లో సీఎం జగన్ డబ్బులను జమ చేయనున్నారు.

కేరళ కొచ్చిన్ ఎయిర్‌పోర్ట్‌లో ఎయిరిండియా విమానాన్ని ఎమర్జెన్సీగా ల్యాండ్ చేశారు. షార్జా-కొచ్చిన్‌ ఎయిరిండియా విమానంలో హైడ్రాలిక్ వైఫల్యంను పైలెట్ గుర్తించి ల్యాండ్ చేశారు.

తమిళనాడులో పెనుప్రమాదం తప్పింది. అర్థరాత్రి రన్నింగ్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బస్సు నుంచి ప్రయాణికులు బయటకు పరుగులు తీశారు. కోయంబత్తూరు నుంచి బెంగళూరుకు వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది.

నెల్లూరు పెంచలకోనలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగింది. దుకాణాల్లో షార్ట్‌సర్క్యూట్ జరగటం తో దుకాణదారులకు విద్యుత్ షాక్ తగిలింది.

Advertisement

ఫిబ్రవరి 3 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఫిబ్రవరి 3న తెలంగాణ సర్కార్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. గవర్నర్‌ అనుమతి కోసం ఈ నెల 21న ప్రభుత్వం లేఖ రాశారు. గవర్నర్ ప్రసంగం ఉందా అని ప్రభుత్వానికి రాజ్‌భవన్‌ నుంచి లేఖ రాశారు.

తెలంగాణ ఇంటర్ బోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్ కు కేవలం 70% సిలబస్ మాత్రమే ఉంటుందని ప్రకటించింది. సెకండియర్ విద్యార్థులకు మాత్రం 100% సిలబస్ ఉంటుందని స్పష్టం చేసింది.

ఆస్ట్రేలియాలో ఖలికిస్థాన్ మద్దతు దారులు దారుణానికి పాల్పడ్డారు. కొంతమంది భారతీయులపై మద్దతుదారులు దాడికి తెగబడ్డారు.

తెలంగాణలో ఆన్లైన్ బెట్టింగ్ ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాజాగా ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 24 కోట్ల రూపాయలను సీజ్ చేశారు.

modi

మహాత్మా గాంధీకి ప్రధాని నరేంద్ర మోడీ నివాళులు అర్పించారు గాంధీజీ వర్ధంతి సందర్భంగా ప్రధాని ఆయనను కొన్ని అర్పించారు.

Visitors Are Also Reading