Home » Jan 21st 2023 Top News : నేటి ముఖ్యమైన వార్తలు..!

Jan 21st 2023 Top News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad

డేరా బాబాకు 40 రోజుల పెరోల్ విధించారు. అత్యాచా*, హ* కేసులో శిక్ష డేరాబాబా శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే.

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో పెట్రోల్‌ దందా జోరుగా జరుగుతోంది. బ్లాక్‌లో రూ.5 తక్కువకే వ్యాపారులు అమ్ముతున్నారు. కర్ణాటక, మహారాష్ట్ర నుంచి తక్కువ ధరకు తెచ్చి అమ్ముతున్నారు. పెట్రోల్‌, డీజిల్‌ కోసం షాపుల దగ్గర క్యూ కడుతున్నారు.

Advertisement


తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఆకాశాన్ని అంటాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,350.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,110.. కిలో వెండి ధర రూ.72,100 గా ఉన్నాయి.

తిరుమలలో 6 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారిని 60,765 మంది భక్తులు దర్శించుకున్నారు.

Advertisement

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,350 ఉండగా….24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,110.. కిలో వెండి ధర రూ.72,100 గా ఉన్నాయి.

ఢిల్లీలో డీజీపీల అఖిల భారత సదస్సు నిర్వహిస్తున్నారు. డీజీపీల సదస్సును ఉద్దేశించి నేడు ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించనున్నారు.

కేస్లాపూర్‌లో నేటి నుంచి నాగోబా జాతర జరగనుంది. అర్ధరాత్రి మహాపూజతో నాగోబా జాతర ప్రారంభం కానుంది. వేలాదిగా ఆదివాసీలు జాతరకు తరలివస్తున్నారు.

నేడు భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య రెండో వన్డే జరగనుంది. రాయ్‌పూర్‌ వేదికగా మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్‌ జరగనుంది.

హైదరాబాద్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో కృష్ణ ఎక్స్ ప్రెస్ కు బాంబు బెదిరింపులు వచ్చాయి. దాంతో భారీగా పోలీస్ బలగాలు అక్కడకు చేరుకుని తనిఖీలు నిర్వహించారు.

Visitors Are Also Reading