Home » Jan 14th 2023 Top News : నేటి ముఖ్యమైన వార్తలు..!

Jan 14th 2023 Top News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లావ్యాప్తంగా కోడిపందాలకు సిద్ధమైన బరులు..అనధికార అనుమతుల కోసం వేచి చూస్తున్న పందెం రాయుళ్లు..ఉమ్మడి జిల్లాలో దాదాపు 150 బరులు వరకు సిద్ధం చేసిన నిర్వాహకులు. 11 గంటల నుంచి కోడిపందాలు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

12 మంది డిప్యూటీ సెక్రటరీలకు జాయింట్ సెక్రటరీలుగా తాత్కాలిక పదోన్నతి కల్పించారు. సెక్రటేరీయేట్ లోని వివిధ విభాగాల్లో పని చేసే డిప్యూటీ సెక్రటరీలకు టెంపరరీ ప్రమోషన్ లు ఇచ్చారు. పెండింగులో ఉన్న కోర్టు కేసుల తీర్పునకు లోబడి తుది ప్రమోషన్లు ఉంటాయని స్పష్టం చేశారు.

Advertisement

నేటి నుండి వందే భారత్ ట్రైన్ కు టికెట్ బుకింగ్ సదుపాయం కల్పిస్తున్నారు. రేపు ప్రధాని మోడీ చేతుల మీదుగా వర్చువల్ గా ప్రారంభం చేస్తున్నారు. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వరకు 8.30 గంటల్లో భారత్ ట్రైన్ చేరుకోనుంది.

మళ్ళీ రాష్ట్రానికి మంచిరోజులు వస్తున్నాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పుంగనూరులో 10రోజుల్లో వందకు పైగా కేసులు పెట్టారని. పండగ పూట మావాళ్ళు జైల్లో ఉన్నారు..మంత్రి పెద్దిరెడ్డిని హెచ్చరిస్తున్నా..వచ్చే పండగకు ఎక్కడ ఉంటావో చూసుకో..అన్ని లెక్కలు రాస్తున్నా..ఈసారి క్షమించను అని అన్నారు.

రేపు ఢిల్లీకి బయలు బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు బయలు దేరుతారు. ఢిల్లీలో కొంతమంది కేంద్ర మంత్రులతో సోము వీర్రాజు భేటీ కానున్నారు. ఈనెల 16,17న జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొననున్నారు.

Advertisement

తిరుమలలో భక్తుల రద్దీ తగ్గిపోయింది. ఒక కంపార్టుమెంటులో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 7 గంటల సమయం పడుతుంది.

నారావారిపల్లెలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, నటుడు ఎమ్మెల్యే బాలకృష్ణ కుటుంబసభ్యులు మరియు జిల్లా ముఖ్య నేతలు సంక్రాంతి పండుగ జరుపుకుంటున్నారు.

విశాఖ నగరం లో మంచు కురుస్తోంది. మంచు దుప్పట్లో నగరం కనిపిస్తోంది. ఎయిర్ పోర్ట్ దగ్గర వర్షంలా మంచు కురుస్తోంది. భోగి మంటలు,పొగ తోడవడంతో కమ్మేసిన మేఘం…ఎయిర్ పోర్ట్ దగ్గర 10 అడుగుల దూరంలో ఉన్న వాహనాలు కనిపించక ఇబ్బందులు పడుతున్నారు.

రేపు తన నివాసంలో సీఎం జగన్ సంక్రాంతి సంబరాలు చేసుకోనున్నారు. సతీసమేతంగా సంక్రాంతి వేడుకల్లో సీఎం జగన్ పాల్గొనబోతున్నారు.

మంత్రి కేటీఆర్ స్విట్జర్లాండ్‌ వెళ్లనున్నారు. ఈనెల 16వ తేదీ నుంచి ప్రారంభమయ్యే దావోస్‌ వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ సమ్మిట్‌-2023లో పాల్గొననున్నారు.

టెన్నిస్ స్టార్ సానియా మీర్జా రిటైర్మెంట్‌ ప్రకటించారు. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఆడేందుకు సానియా ఆస్ట్రేలియా చేరుకున్నారు. ఈ ఏడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌, ఫిబ్రవరిలో జరిగే దుబాయి ఓపెన్‌ తర్వాత టెన్నిస్‌కు వీడ్కోలు పలకనున్నట్టు సానియా ప్రకటించింది.

Visitors Are Also Reading