Home » Dussehra 2023: విజయదశమి నాడు శమీ పూజని ఎందుకు చెయ్యాలి..? కారణం ఏమిటో తెలుసా..?

Dussehra 2023: విజయదశమి నాడు శమీ పూజని ఎందుకు చెయ్యాలి..? కారణం ఏమిటో తెలుసా..?

by Sravya
Ad

దసరా పండుగని హిందువులందరూ కూడా ఎంతో ఘనంగా జరుపుతారు. నవరాత్రులు కూడా అంగరంగ వైభవంగా చేస్తూ ఉంటారు. విజయదశమి నాడు శమీ పూజ చేస్తూ ఉంటారు. శమీ పూజ ఎందుకు చేయాలి..? శమీ పూజ చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుంది అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. శమీ పూజ దశమి రోజు చేస్తారు. ఇది చాలా ప్రత్యేకమైనది. జమ్మి చెట్టుని శమీ చెట్టు అని అంటారు. అజ్ఞాతవాసంలో ఆయుధాలని పాండవులు ఈ చెట్టు పైనే దాచిపెట్టారు. తర్వాత విరాటుడు కొలువులో ఉన్న పాండవులు ఏడాది అయిన తర్వాత మళ్లీ ఇదే వృక్షం దగ్గరికి వచ్చి, ఈ వృక్షాన్ని పూజించి ఆయుధాలను తీసుకున్నారు.

Advertisement

Advertisement

అపరాజిత దేవి ఆశీస్సులు వృక్షరూపంలో వచ్చాయని కౌరవులపై విజయాన్ని సాధిస్తారు పాండవులు. శమీ చెట్టుకి పూజ చేసి తర్వాత పాలపిట్టని కూడా చాలామంది చూస్తారు. దశమి రోజు నక్షత్రాలను చూశాక శమీ వృక్షం దగ్గర అపరాజితాదేవిని పూజిస్తారు. శమి చెట్టుకి పూజ చేసి ప్రదక్షిణలు చేసి ఇంటికి తిరిగి వస్తారు. విజయదశమి నాడు పాలపిట్టను చూస్తే అదృష్టంగా భావిస్తారు. దసరా రోజు మంచి కలగాలంటే పాలపిట్టని చూడాలని పెద్దలు అంటూ ఉంటారు. పాలపిట్ట కనపడితే విజయాన్ని అందుకున్నట్లుగా భావిస్తారు. అదృష్టం కూడా కలిసి వస్తుందని నమ్ముతారు.

Also read:

Visitors Are Also Reading