Home » కేవ‌లం రింగ్ టోన్స్ పైన 1.4 కోట్లు క‌లెక్ట్ చేసిన సినిమా!

కేవ‌లం రింగ్ టోన్స్ పైన 1.4 కోట్లు క‌లెక్ట్ చేసిన సినిమా!

by Azhar
Ad

They call him a cool cool angry man Super andhra thelusa….. జ‌ల్సా అంటూ సాగే పాట‌, మై హార్ట్ ఈజ్ బీటింగ్ అంటూ మ‌రో పాట‌, ఛ‌లొరె ఛ‌లొరే అంటూ ఇంకో పాట‌, గాల్లో తేలిన‌ట్టుందే అంటూ మ‌రో మెలొడీ…మొత్తంగా 2008లో ఎక్క‌డ విన్నా ఈ పాట‌లే….అందుకే ఈ పాట‌ల‌న్నీ క‌లిసి ఓ కొత్త రికార్డ్ ను సృష్టించాయి. ఆ రికార్డ్ ఏంటంటే… ఈ సినిమా పాట‌ల‌ రింగ్ టోన్స్ 1కోటి 40ల‌క్ష‌లు క‌లెక్ట్ చేశాయి.

Also Read: బ‌ట్ట‌లు మార్చుకునేందుకు కార‌వాన్ లేదు..షూటింగ్ లో అలాంటి అనుభ‌వాలు : న‌టి హేమ‌

Advertisement

 

ప‌వ‌న్ క‌ళ్యాణ్ త్రివిక్ర‌మ్ కాంబోలో వ‌చ్చిన జ‌ల్సాతో ప‌వ‌న్ ఖుషి త‌ర్వాత ఆ రేంజ్ హిట్ కొట్టాడు. 20 కోట్ల బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన ఈ సినిమా ఆడియో రైట్స్ ను ఆదిత్య మ్యూజిక్ 90 లక్షలకు కొన్నారు, ఇదో రికార్డ్ ! దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు మ్యూజిక్ ను అందించాడు. సంజ‌య్ సాహూ ( ప‌వ‌న్ క‌ళ్యాణ్ ) క్యారెక్ట‌ర్ ఇంట్రోకు మ‌హేష్ బాబు వాయిస్ ఓవ‌ర్ అందించాడు.

Advertisement

బంగారం మూవీ క్లైమాక్స్ షూట్ చేస్తున్న‌ప్పుడు త్రివిక్ర‌మ్ వ‌చ్చి ప‌వ‌న్ ను క‌లిసి జ‌ల్సా స్టోరీ చెప్పాడు. క‌థ న‌చ్చ‌డంతో ప‌వ‌న్ ఈ సినిమాకు ఓకే చెప్పాడు అదే స‌మ‌యంలో క‌థ‌లో న‌క్స‌లైట్ క్యారెక్ట‌ర్ ఉండేలా ప్లాన్ చేయండి అన‌డంతో క‌థ‌లో కొన్ని అనివార్య మార్పులు చేయాల్సి వ‌చ్చింది. అలా 2008లో జ‌ల్సా తెర‌కెక్కింది. ప‌వ‌న్ కెరీర్ లో వ‌న్ ఆఫ్ ది మైల్ స్టోన్ ఈ మూవీ!

Also Read: తమిళ సినిమాకు బాలీవుడ్ బ్యూటీ ప్ర‌మోష‌న్స్‌.. ఏమిటో విశేషం..?

Visitors Are Also Reading