జాఫర్ ఇతని పేరు చెబితే పెద్దగా ఎవరికి తెలియకపోవచ్చు…కానీ విక్రమ్ సినిమాలో కట్టర్ అంటే మాత్రం అందరూ టక్కున గుర్తుపడతారు. ఇతను విక్రమ్ సినిమాలో తన అద్భుతమైన నటనతో ఎంతోమంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. సినిమాలో ఇతను సేతుపతి గ్యాంగ్ లో ఒకరిగా ఉంటాడు. సినిమాల్లో జాఫర్ ది చాలా చిన్నపాత్ర అయినప్పటికీ చాలా పాపులర్ అయ్యాడు.
ఇతను మొదటగా పావ కధైగల్ అనే వెబ్ సిరీస్ తో తన కెరీర్ ని ప్రారంభించాడు. ఇక అందులో తన నటనకి ఫిదా అయిన లోకేష్ విక్రమ్ సినిమాలో ఇతనికి అవకాశాన్ని ఇచ్చారు. ఇక విక్రమ్ సినిమా అనంతరం జాఫర్ కి వరుసగా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. శింబు, జైలర్ వంటి అద్భుతమైన సినిమాల్లో అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. ఇప్పుడు ఇతనికి వరుసగా అవకాశాలు వస్తూ ఉన్నాయి. తన అద్భుతమైన నటనతో తెగ పాపులారిటీని సంపాదించుకుంటున్నాడు.
Advertisement
Advertisement
ఇక రీసెంట్గా తన గర్ల్ ఫ్రెండ్ ను పరిచయం చేశాడు. ఆమె పేరు సిద్దిక. ఈమె ఓ డ్యాన్సర్. ప్రైవేట్ ఆల్బమ్స్ కు కొరియోగ్రాఫర్ గా వ్యవహరిస్తోంది. జాఫర్ తన గర్ల్ ఫ్రెండ్ సిద్ధికతో కలిసి చాలా స్టైలిష్ గా కొన్ని ఫోటోలను దిగి ఆ ఫోటోలను అభిమానులతో పంచుకుంటున్నాడు. ఇక వీరిద్దరి జోడిని చూసి చాలామంది కామెంట్లు పెడుతున్నారు.
ఇవి కూడా చదవండి
- Rohit Sharma : 200 స్పీడ్తో రోహిత్ ర్యాష్ డ్రైవింగ్..లక్షల్లో జరిమానా విధించిన పోలీసులు!
- పుష్ప-2 సినిమాలో చిరంజీవి..బన్నీ క్రేజీ ప్లాన్
- టీమిండియాను ఓడిస్తే, డేట్ చేస్తా… బంగ్లా ఆటగాళ్లకు పాక్ నటి ఆఫర్