విభిన్న పాత్రల్లో నటిస్తూ సరికొత్త కథలతో ముందుకు వచ్చే హీరో సూర్య. గజిని, సింగం లాంటి డిఫరెంట్ సినిమాలతో సూర్య ప్రేక్షకుల ముందుకు వచ్చి సందడి చేశారు. కాగా లాక్ డౌన్ వేళ థియేటర్లు మూత పడటంతో సూర్య జై భీమ్ అనే సినిమాతో అమేజాన్ ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఓటీటీలో విడుదలైన ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు అందాయి. ఈ చిత్రంలో సూర్య తన నటనతో ఆకట్టుకున్నారు.
ఈ సినిమాలోని ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులకు ఎంతగానో కనెక్ట్ అయ్యాయి. ఇక ఈ చిత్రం లాయర్ చంద్రు నిజజీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి జ్ఞానవేల్ దర్శకత్వం వహించారు. సూర్య భార్య జ్యోతి ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రం పై కేవలం సినీ ప్రముఖులే కాకుండా రాజకీయ ప్రముఖులు సైతం ప్రశంసలు కురిపించారు. ఈ సినిమా ఇప్పటివరకు పలు రికార్డులను బ్రేక్ చేసిన సంగతి తెలిసిందే.
Advertisement
Advertisement
అయితే తాజాగా ఈ సినిమా మరో అరుదైన రికార్డును నమోదు చేసుకుంది. ఆస్కార్ అకాడమీ అధికారిక యూట్యూబ్ ఛానల్ లో ఈ సినిమాకు సంబంధించిన ఓ వీడియోను చూపించారు. ఆ సన్నివేశం సినిమా ప్రారంభంలో ఉండే ఖైదీలతో ప్రారంభమవుతుంది. అంతేకాకుండా సినిమాలో కోర్టులో సూర్య వాదించే సన్నివేశాలను కూడా చూపించారు.
ఇక క్లైమాక్స్ లో కేసు గెలిచిన తర్వాత సూర్య సిన తల్లి మధ్య ఉండే మోషనల్ సన్నివేశాన్ని సైతం ఈ వీడియోలో చూపించారు. ఆస్కార్ అకాడమీ తమ సినిమాలోని వీడియోను షేర్ చేయడంతో చిత్ర బృందం ఎంతో సంతోషంగా ఉంది. జై భీమ్ సినిమా ఇండియన్ సినిమా స్థాయిని పెంచిందని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.